సిక్కిం సొరంగం ప్రమాదం.. 22 మృతదేహాలు వెలికితీత

సిక్కింలోని నామ్చి జిల్లాలో నిర్మాణంలో ఉన్న ఎన్‌హెచ్‌పీసీ తీస్తా స్టేజ్-VI జలవిద్యుత్ ప్రాజెక్ట్ సొరంగం కూలిన ప్రమాదంలో చనిపోయిన 22 మంది కార్మికుల మృతదేహాలను వెలికితీసినట్లు అధికారులు తెలిపారు.

సిక్కింలోని నామ్చి జిల్లాలో నిర్మాణంలో ఉన్న ఎన్‌హెచ్‌పీసీ తీస్తా స్టేజ్-VI జలవిద్యుత్ ప్రాజెక్ట్ సొరంగం కూలిన ప్రమాదంలో చనిపోయిన 22 మంది కార్మికుల మృతదేహాలను వెలికితీసినట్లు అధికారులు తెలిపారు. సోమవారం మీథేన్ వాయువు విడుదలవ్వడంతో పేలుడు సంభవించింది. దీంతో సొరంగం కూలిపోగా..ఆ సమయంలో లోపల 25 మంది కార్మికులు విధుల్లో ఉన్నారు. వారిలో 22 మంది మరణించినట్లు నామ్చి ఎస్పీ సోనమ్ భూటియా వివరించారు.

మృతుల కుటుంబాలకు ఎన్ హెచ్ పీసీ(NHPC) తరఫున రూ.5 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.4లక్షలు ఇస్తామని ప్రకటించాయి.ప్రధాని నరేంద్రమోదీ ఈ దుర్ఘటనపై విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ₹2 లక్షలు, గాయపడిన వారికి ₹50,000 చొప్పున పరిహారాన్ని ప్రకటించారు.

Latest News