Stray Dog Bites : వీధి కుక్కల కేసులో సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు
వీధి కుక్కల దాడులు, మరణాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ఆహారం పెట్టేవారూ బాధ్యులేనని సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
విధాత : వీధి కుక్కల దాడి, మరణాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ఆహారం ఇచ్చేవారు కూడా బాధ్యులేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కుక్క కాటుకు గురై చనిపోయిన వారికి ప్రభుత్వాలే భారీ పరిహారం ఇవ్వాలని ..వీధి కుక్కల బెడద నివారణకు కేంద్ర రాష్ఱ్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోకపోతే భారీ జరిమానాలు విధిస్తామని సుప్రీంకోర్టు హెచ్చరించింది. ప్రతి కుక్క కాటు కు పరిహారం చెల్లించాల్సిందేనని స్పష్టం చేసింది. మంగళవారం వీధి కుక్కల వివాదంపై విచారణ కొనసాగించిన సుప్రీంకోర్టు ఈ వివాదం పై కీలక వ్యాఖ్యలు చేసింది. కుక్క కరిచిన ప్రభావం బాధిత వ్యక్తిపై జీవితకాలం ఉంటుందని న్యాయస్థానం పేర్కొంది.
దేశ వ్యాప్తంగా వీధి కుక్కల దాడులు పెరుగుతున్న నేపథ్యంలో గత ఏడాది నవంబర్ లో సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. విద్యాసంస్థలు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, క్రీడా సముదాయాలు ఇతర బహిరంగ ప్రదేశాల సమీపంలోని వీధి కుక్కలను షెల్టర్లకు తరలించాలని ఆదేశించింది. వీధి కుక్కలకు ఆహారం పెట్టే వారికి శునకాలపై అంత ప్రేమ ఉంటే వాటిని ఇంటికి తీసుకెళ్ళి పెంచుకోవాలని పేర్కొంది. మీ భావోద్వేగం కేవలం కుక్కల పైన మాత్రమే అయితే..మా ఆందోళన వాటితో సమానంగా బాధిత ప్రజల పట్ల కూడా అని స్పష్టం చేసింది. కుక్కలు వీధుల్లో తిరుగుతూ ప్రజలు భయపడే పరిస్థితిని మేం ఆమోదించబోమని ధర్మాసనం పేర్కొంది. ఏదైనా సంస్థ ఆహారం పెడుతున్న కుక్కల దాడిలో ఓ చిన్నారి మరణిస్తే అప్పుడు ఎవరిని బాధ్యుల్ని చేయాలని.. ఈ ప్రాణా నష్టానికి సదరు సంస్థ బాధ్యత వహించదా అని ప్రశ్నించింది. వీధి కుక్కల బెడదల నివారించేందుకు రాష్ట్రాలు తగిన చర్యలు చేపట్టాలని.. లేదంటే ప్రతి కుక్క కాటుకు.. కుక్కల దాడిలో జరిగిన ప్రతి మరణానికి గాను ఆ రాష్ట్రాలపై మేము నిర్దేశిత భారీ పరిహారాలను చెల్లించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
ఇవి కూడా చదవండి :
Army Chief Upendra Dwivedi : ఉగ్రవాదులకు ఇండియన్ ఆర్మీ చీఫ్ స్ట్రాంగ్ వార్నింగ్
Cow vs Leopard Fight : చిరుతతో పోరాడి గెలిచిన ఆవు.. షాకింగ్ వీడియో
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram