విధాత : పార్లమెంట్ సమావేశాల్లో మెదక్ ఎంపీ రఘునందన్‌రావు తెలుగులో మాట్లాడి ప్రత్యేకతను చాటారు. జీరో అవర్లో భాగంగా తనకు మొదటిసారి మాట్లాడే అవకాశం కల్పించినందుకు స్పీకర్‌కు ధన్యవాదాలు తెలిపారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంట్ నియోజకవర్గం నుంచి గతంలో మాజీ ప్రధాని ఇందిరా గాంధీ, కేసీఆర్ ప్రాతినిధ్యం వహించారని గుర్తుచేశారు. నియోజకవర్గం పరిదిలోని పటాన్ చెరు అనేది ఆసియాలో పెద్ద ఇండస్ట్రీయల్ ఏరియా, మెదక్ జిల్లా ఇండస్ట్రీలకు ప్రసిద్ధి చెందిందని గుర్తుచేశారు. ఇక్కడి ప్రజల కోరిక మేరకు సర్వే కూడా పూర్తయిన 225 కిలోమీటర్ల రైల్వే లైన్ వెంటనే నిర్మాణం చెయ్యాలని పార్లమెంట్ లో విజ్ఞప్తి చేశారు.అయితే తెల్లాపూర్, పటాన్ చెరువు, సంగారెడ్డి, జోగిపేట, మెదక్, రామాయంపేట, సిద్దిపేట వరకు రైల్వే లైన్ సర్వే పూర్తయ్యి పనులు మాత్రం మొదలు కాలేదని వెల్లడించారు. 44 ఏళ్ల నుంచి కేవలం 9 కిలోమీటర్ల రైల్వే లైన్ పూర్తి అయిందని, దాన్ని కూడా ఆదాయం రావడం లేదని రైళ్ల రాకపోకలు నిలిపివేశారని చెప్పారు. తెలంగాణాలో అన్ని జిల్లాలకు రైల్వే స్టేషన్ ఉందని, కానీ తమ జిల్లా కేంద్రం ఒక్క సంగారెడ్డికి మాత్రమే రైల్వే స్టేషన్ లేదని, వీలైనంత త్వరగా తమ రైల్వే లైన్ పూర్తి చేయాలని కోరారు.
MP Raghunandan Rao | పార్లమెంటులో మెదక్ ఎంపీ రఘునందన్‌రావు తెలుగు ప్రసంగం
పార్లమెంట్ సమావేశాల్లో మెదక్ ఎంపీ రఘునందన్‌రావు తెలుగులో మాట్లాడి ప్రత్యేకతను చాటారు. జీరో అవర్లో భాగంగా తనకు మొదటిసారి మాట్లాడే అవకాశం కల్పించినందుకు స్పీకర్‌కు ధన్యవాదాలు తెలిపారు.

Latest News
ఏపీ మాజీ డిప్యూటీ సీఎం మృతి
ఈనెల 17 న హైదరాబాద్‌లో ఉపరాష్ట్రపతి పర్యటన
విద్యా, పర్యాటక, వైద్య రంగాల్లో కలిసి పనిచేద్దాం.. ప్రిన్స్ రహీమ్ ఆగా ఖాన్-vకు సీఎం విజ్ఞప్తి
ఐవీ కొనేది రూ.11కు.. రోగులకు అమ్మేది మాత్రం రూ.325కు
నేటి నుంచి తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు
ఖైరతాబాద్ గణేశుడికి గవర్నర్ దంపతుల తొలి పూజలు
ప్రకృతిని కాపాడుదాం.. చవితి ప్రత్యేకత ను చాటుదాం : జర్నలిస్ట్ గిరి ప్రసాద్ సోముల
పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది
ఘనంగా ‘జై గౌరీపుత్ర గణేశా’ ఆడియో, ట్రైలర్ ఆవిష్కరణ*
పోతునూరు రైతుల “వరి” గోస