కశ్మీర్‌లో ఎదురుకాల్పులు.. ఉగ్రవాది హతం

- కొనసాగుతున్న సెర్చ్ ఆపరేషన్
విధాత: జమ్ముకశ్మీర్‌లోని షోపియాన్ జిల్లాలో గురువారం ఉదయం భద్రతా బలగాలు ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎదురుకాల్పుల్లో ఒక ఉగ్రవాది హత్యమైనట్టు అధికారులు వెల్లడించారు. పోలీసుల వివరాల ప్రకారం.. జిల్లాలోని కథోహలన్ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో భద్రతా దళాల సిబ్బంది ఉదయం కార్డన్, సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి.
భద్రతా సిబ్బందిని ముందే పసిగట్టిన ఉగ్రవాదులు కాల్పులు ప్రారంభించారు. భద్రతా బలగాలు జరిపిన ఎదురుకాల్పుల్లో ఒక ఉగ్రవాది హతమయ్యాడు. చనిపోయిన ఉగ్రవాదిని ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (టీఆర్‌ఎఫ్)కు చెందిన ఉగ్రవాదిగా గుర్తించారు. ఆ ప్రాంతంలో ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని కశ్మీర్ జోన్ పోలీసులు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.