Video | రిటైర్డ్ జ‌స్టిస్ ఇంట్లో దొంగ‌లు.. బంగారు ఆభ‌ర‌ణాలు చోరీ..

Video | ఓ రిటైర్డ్ జస్టిస్( Retired Justice ) ఇంట్లో దొంగ‌లు ప‌డ్డారు. 4 నిమిషాల వ్య‌వ‌ధిలోనే దొంగ‌లు చోరీ చేసి త‌ప్పించుకుపోయారు. విలువైన బంగారు ఆభ‌ర‌ణాల‌ను( Gold Ornaments ) ఎత్తుకెళ్లారు.

Video | రిటైర్డ్ జ‌స్టిస్ ఇంట్లో దొంగ‌లు.. బంగారు ఆభ‌ర‌ణాలు చోరీ..

Video | ఓ రిటైర్డ్ జస్టిస్( Retired Justice ) ఇంట్లో దొంగ‌లు ప‌డ్డారు. 4 నిమిషాల వ్య‌వ‌ధిలోనే దొంగ‌లు చోరీ చేసి త‌ప్పించుకుపోయారు. విలువైన బంగారు ఆభ‌ర‌ణాల‌ను( Gold Ornaments ) ఎత్తుకెళ్లారు. ఈ ఘ‌ట‌న మ‌ధ్య‌ప్ర‌దేశ్‌( Madhya Pradesh )లోని ఇండోర్ సిటీ( Indore City )లో ఆదివారం తెల్ల‌వారుజామున చోటు చేసుకోగా ఆల‌స్యంగా వెలుగు చూసింది.

వివ‌రాల్లోకి వెళ్తే.. ఇండోర్ సిటీలోని విజ‌య్ న‌గ‌ర్‌( Vijay Nagar )లో రిటైర్డ్ జ‌స్టిస్ ర‌మేశ్ గార్గ్( Justice Ramesh Garg ) త‌న కుటుంబ స‌భ్యుల‌తో నివాసం ఉంటున్నారు. అయితే ఆదివారం తెల్ల‌వారుజామున 3.30 గంట‌ల‌కు ర‌మేశ్ గార్గ్ ఇంట్లోకి ఓ ఇద్ద‌రు దొంగ‌లు చొర‌బ‌డ్డారు. ఇక బెడ్రూంలోకి ప్ర‌వేశించిన దొంగ‌లు.. ర‌మేశ్ కుమారుడు రిత్విక్ గాఢ నిద్ర‌లో ఉన్న విష‌యాన్ని గ‌మ‌నించారు. ఇక ఓ దొంగ అల్మారాలో ఉన్న విలువైన బంగారు, వెండి వ‌స్తువుల‌తో న‌గ‌దును దోచుకున్నాడు. ఒక వేళ ఈ శ‌బ్దానికి రిత్విక్‌కు మెల‌కువ వ‌స్తే అత‌న్ని ఇనుప రాడ్‌తో కొట్టేందుకు మ‌రో దొంగ సిద్ధంగా ఉన్నాడు. ఈ చోరీని 4 నిమిషాల 10 సెక‌న్ల‌లో ముగించారు. అనంత‌రం ఆ ఇంటి నుంచి దొంగ‌లు బ‌య‌ట‌కు వ‌చ్చి ప‌రారీ అయ్యారు. ఈ చోరీ దృశ్యాలు అక్క‌డున్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి.

మార్నింగ్ నిద్ర నుంచి మేల్కొన్న రిత్విక్.. త‌న ఇంట్లో చోరీ జ‌రిగిన విష‌యాన్ని గుర్తించి, పోలీసుల‌కు స‌మాచారం అందించారు. ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజీల‌ను ప‌రిశీలించారు. దొంగ‌ల‌ను త్వ‌ర‌లోనే ప‌ట్టుకుంటామ‌ని చెప్పారు. చోరీ జ‌రిగిన స‌మ‌యంలో రిత్విక్ ఒక గ‌దిలో ఉండ‌గా, భార్యాపిల్ల‌లు మ‌రో గ‌దిలో నిద్రిస్తున్న‌ట్లు పోలీసులు తెలిపారు. అయితే దొంగ‌లు ర‌మేశ్ ఇంటి కిటికీలు తొల‌గించి లోప‌లికి ప్ర‌వేశించిన‌ట్లు పోలీసులు నిర్ధారించారు. ప్ర‌ముఖులు నివాసం ఉండే విజ‌య్ న‌గ‌ర్‌లో చోరీలు జ‌ర‌గ‌డం భ‌ద్ర‌తా స‌మ‌స్య‌ల‌పై ఆందోళ‌న వ్య‌క్తం అవుతుంది. ఈ కాల‌నీలో భ‌ద్ర‌త ప‌టిష్టం చేయాల‌ని స్థానికులు పోలీసుల‌ను కోరారు.