Mozambique Boat Accident : మొజాంబిక్ లో బోట్ బోల్తా…ముగ్గురు భారతీయుల మృతి

ఆఫ్రికా దేశం మొజాంబిక్‌లోని బెయిరా ఓడరేవు సమీపంలో బోటు బోల్తా పడిన ఘటనలో ముగ్గురు భారతీయ సిబ్బంది మృతి చెందగా, ఐదుగురు గల్లంతయ్యారు. 14 మంది భారతీయులతో వెళ్తున్న బోటు శుక్రవారం ప్రమాదానికి గురైంది.

Mozambique Boat Accident : మొజాంబిక్ లో బోట్ బోల్తా…ముగ్గురు భారతీయుల మృతి

న్యూఢిల్లీ: ఆఫ్రికా దేశం మొజాంబిక్‌లో బెయిరా ఓడరేవు సమీపంలో బోట్ ప్రమాదంలో ముగ్గురు భారతీయులు మృతి చెందగా..మరో ఐదుగురు గల్లంతయ్యారు. బోటులో 14 మంది భారతీయ సిబ్బందితో సహా మరికొందరిని తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదంలో రక్షించిన వారిని స్థానిక సిబ్బంది బెయిరాలోని ఆసుపత్రికి తరలించారు. బెయిరా ఓడరేవు వద్ద సిబ్బంది బదిలీ ఆపరేషన్ల సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు భారత హైకమిషన్ వెల్లడించింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను తమ అధికారులు సందర్శించారని.. మృతుల కుటుంబాలను సంప్రదించి.. వారికి కావాల్సిన సహాయాన్ని అందిస్తున్నట్లు కమిషన్ పేర్కొంది. అయితే మృతుల పేర్లు, వివరాలు తెలియాల్సి ఉంది. గల్లంతైన వారి ఆచూకీ కోసం స్థానిక అధికారులు, సముద్ర సంస్థలు, భారత దౌత్య కార్యాలయం సమన్వయంతో పనిచేస్తున్నాయని అధికారులు పేర్కొన్నారు. ఈ ఘటనలో క్షతగాత్రులకు సంబంధించిన వివరాలు తెలుసుకోవడానికి ఫోన్ నెంబర్లను భారత హైకమిషన్ సోషల్ మీడియాలో పోస్టు చేసింది.

ఆఫ్రికా దేశమైన మొజాంబిక్‌లో బెయిరా ఓడరేవు సమీపంలో బోటు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు భారతీయులు మృతి చెందగా.. మరో అయిదుగురు గల్లంతయ్యారు. 14 మంది భారతీయ సిబ్బందితో సహా మరికొందరిని తీసుకెళ్తున్న బోట్ బోల్తా పడిన ఘటనలో ముగ్గురు భారతీయులు మరణించగా, ఐదుగురు గల్లంతైనట్లు భారత హైకమిషన్ శనివారం ధ్రువీకరించింది. మిగిలిన వారిని స్థానిక సిబ్బంది రక్షించినట్లు తెలిపింది. శుక్రవారం బెయిరా ఓడరేవు వద్ద సిబ్బంది బదిలీ ఆపరేషన్ల సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు వెల్లడించింది.