బిగ్ డే…లోక్ సభ ముందుకు మూడు కీలక బిల్లులు..ప్రతిపక్షాల నిరసనలు
లోక్‌సభలో మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ సహా మూడు కీలక బిల్లులను కేంద్రం ప్రవేశపెట్టింది. సీట్లు 850కు పెంపుపై ప్రతిపక్షాలు తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి.
విధాత : భారత రాజకీయాల్లో కీలక పరిణామానికి వేదికగా పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు కొనసాగుతున్నాయి. గురువారం లోక్ సభ సమావేశాలలో ముడూ కీలక బిల్లులను కేంద్రం ప్రవేశ పెట్టింది. మహిళ రిజర్వేషన్ బిల్లు, డీలిమిటేషన్ బిల్లు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో నియోజవర్గాల పునర్విభజన సవరణ బిల్లులను కేంద్రం లోక్ సభలో ప్రవేశపెట్టింది. అయితే లోక్ సభ సీట్లను 850కి పెంచడంతో పాటు 2011జనాభా లెక్కల మేరకే దేశంలో డీలిమిటేషన్ ప్రక్రియ చేపట్టే 131 వ రాజ్యాంగ సవరణ బిల్లు పెట్టాలా? వద్దా? అనే దానిపై ఓటింగ్ నిర్వహించారు. మద్దతుగా 207 మంది, వ్యతిరేకంగా 126 మంది ఓటు వేశారు. ఓటింగ్ సమయంలో సభలో 333 మంది ఎంపీలు ఉన్నారు.
ఈ బిల్లులను కాంగ్రెస్, ఎస్పీ, టీఎం,సీ ఆర్ఎస్పీ, డీఎంకే, సీపీఎం, ఎంఐఎంలు వ్యతిరేకించాయి. అనంతం మూడు బిల్లులను లోక్ సభలో కేంద్ర మంత్రులు మేఘ్వాల్, అమిత్ షా లు ప్రవేశ పెట్టారు. మహిళా రిజర్వేషన్ల చట్టం సవరణ బిల్లును న్యాయశాఖ మంత్రి మేఘ్వాల్ ప్రవేశపెట్టి చర్చను ప్రారంభించారు. డీలిమిటేషన్, కేంద్ర పాలిత ప్రాంతాల నియోజకవర్గాల పునర్విభజన సవరణ బిల్లులను అమిత్ షా ప్రవేశ పెట్టారు. కులగణనతో పాటు జనగణన జరుగుతుందని , ఇప్పటికే జన గణన ప్రారంభం అయ్యిందని ఈ సందర్బంగా అమిత్ షా తెలిపారు. మతం ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వాలని ఎక్కడా లేదన్నారు. బిల్లులపై చర్చ జరగకుండా ఎలా మాట్లాడతారు? అని, విపక్షాలు కుల రాజకీయాలు ముందుకు తెచ్చి బిల్లును అడ్డుకోవాలని చూస్తున్నాయని అమిత్ షా మండిపడ్డారు. అయితే ఎంఐఎం ఎంపీ అసదుద్దీన ఓవైసీ మాట్లాడుతూ డీలిమిటేషన్ సవరణ బిల్లు 123 ఆర్పీ యాక్టుకు వ్యతిరేకంగా ఉందని… డీలిమిటేషన్ బిల్లుతో దక్షిణాది రాష్ట్రాలకు నష్టం చేకూరుతుందని వాదించారు.
రాష్ట్రాలలో మొత్తం సీట్లు 815.. మహిళలకు 272 సీట్లు రిజర్వ్: అర్జున్ రామ్ మేఘ్వాల్
పార్లమెంట్ చరిత్రలో ఇది చారిత్రాత్మక రోజు ఏ రాష్ట్రానికి సీట్ల శాతం తగ్గదు అని, రాష్ట్రాల్లో లోక్‌సభ సీట్లు 815కి పెరుగుతాయని( కేంద్ర పాలిత ప్రాంతాల్లో 35సీట్లు) న్యాయశాఖ మంత్రి అర్జున్‌రామ్ మేఘ్‌వాల్ తెలిపారు. లోక్‌సభ స్థానాల పెంపు అనంతరం మహిళా రిజర్వేషన్లతో మహిళలకు 272 సీట్లు రానున్నట్లు మేఘ్‌వాల్ వెల్లడించారు. ఈమేరకు లోక్‌సభలో ఆయన మాట్లాడారు. మహిళా రిజర్వేషన్లను అమలు చేయాల్సిన సమయం వచ్చిందని చెప్పారు. కొన్ని బిల్లులను భావితరాలు మరువలేవని వ్యాఖ్యానించారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లపై ఇప్పటికే పార్లమెంట్ ఆమోదం పొందిందని, సవరణ బిల్లును ఆమోదించాలని కోరారు.
కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ మాట్లాడుతూ.. రాజ్యాంగాన్ని కేంద్ర ప్రభుత్వం హైజాక్ చేస్తోందని, డిలిమిటేషన్ బిల్లు దేశ ఫెడరల్ వ్యవస్థపై తీవ్రమైన దాడిగా అభివర్ణించారు. 2023లో మహిళలకు 33% రిజర్వేషన్ చట్టం తీసుకువచ్చినా, 2024లో అమలు చేయలేదు. జనగణన, డిలిమిటేషన్ పేరుతో ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేస్తున్నారని విమర్శించారు. ఈ బిల్లును వెంటనే ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ అఖిలేష్ యాదవ్ మాట్లాడుతూ మహిళా రిజర్వేషన్లకు అనుకూలంగానే ఉందని, ముస్లిం మహిళలకు కోటా ఇవ్వాలన్నారు. మహిళా రిజర్వేషన్ల కోసం కేంద్రం ఎందుకంత హడావిడి చేస్తోందని, జనగణన పూర్తయిన వెంటనే కులగణన కోరతాం అని స్పష్టం చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లుతో డీలిమిటేషన్ బిల్లు కలపడం అన్యాయమని డీఎంకే ఎంపీలు అభ్యంతరం తెలిపారు. బిల్లులపై 12గంటల పాటు చర్చ ఉంటుందని, అవసరమైతే సమయాన్ని పొడిగిస్తామని, రేపు సాయంత్రం 4గంటలకు ఓటింగ్ ఉంటుందని స్పీకర్ ప్రకటించారు.
ఇవి కూడా చదవండి :
తెలంగాణ కుల గణన లెక్కలు వెల్లడించిన ప్రభుత్వం
Heat Wave | రాబోయే 3 రోజులు దంచికొట్టనున్న ఎండలు.. జర జాగ్రత్త..!
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram