విజయ్ గెలుపు అనూహ్యంగా కనిపిస్తున్నప్పటికీ.. దానికి పునాదులు చాలా లోతునే ఉన్నాయి. సినీ హీరోగా విజయ్‌కు తమిళనాట అంతులేని అభిమానం ఉన్నది. ప్రత్యేకించి దళితులు, యువతలో గొప్ప స్థానం ఉంది. రాజకీయాల్లోకి రావాలని భావించిన విజయ్.. హడావుడి పడలేదు. తన ఫాన్‌బేస్‌ను ఆర్గనైజ్ చేసుకున్న విజయ్.. 2009లో విజయ్ మక్కల్ ఇయక్కం పేరిట క్లబ్స్ ఏర్పాటు చేశారు. ప్రారంభంలో స్వచ్ఛంద సేవ, సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చింది. అది ఫలితాలనిచ్చింది. క్రమంగా పోలింగ్ బూత్ స్థాయిలో విజయ్ మక్కల్ ఇయక్కం పేరు ఇంటిటికీ పరిచితమైపోయింది. విద్యారంగానికి సహకారం, స్థానిక సమస్యల పరిష్కారంలో జోక్యంతో ఇమేజ్ పెరిగింది.
2011లో అన్నాడీఎంకే కూటమికి విజయ్ మద్దతు పలికాడు. అదే విజయ్ తొలి రాజకీయ అడుగు. ఒక సినీ స్టార్ రాజకీయాల్లోకి రావడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయా లేదా అనే టెస్ట్ అది. 2010 – 2020 మధ్య విజయ్ రాజకీయ వైఖరులను సైతం ప్రకటిస్తూ వచ్చారు. 2019లో సిటిజన్‌షిప్ ఎమెండ్‌మెంట్ యాక్ట్‌ను తీవ్రంగా తప్పుపట్టారు. తాను ఇంకెతకాలమో కెమెరాల వెనుక ఉండబోవడం లేదన్న సంకేతాలు ఇచ్చారు. ఆడియో లాంచ్ కార్యక్రమాలు, ఫ్యాన్ మీటింగ్స్, ఛారిటీ కార్యక్రమాల్లో పరీక్షల ఒత్తిడి, యువత ఎదుర్కొంటున్న నిరుద్యోగిత, అవినీతి, సుపరిపాలన వంటి అంశాలు టచ్ చేస్తూ వచ్చారు. వాస్తవానికి జెన్ జీ, పట్టణ ప్రజలు కనెక్ట్ అయ్యే అంశాలవి. 2021 స్థానిక ఎన్నికల్లో విజయ్ మక్కల్ ఇయక్కం అభ్యర్థులు వారు పోటీచేసిన స్థానాల్లో మెజార్టీ సీట్లు గెలిచారు. తద్వారా అభిమానాన్ని బ్యాలెట్ల రూపంలోకి మలిచారు.
2024 ఫిబ్రవరిలో అసలైన అడుగు పడింది. విజయ్ ఫైనల్‌గా తమిళగ వెట్రి కళగం పేరిట పార్టీని ప్రకటించారు. ఆ సమయంలోనే చాలా స్పష్టతనిచ్చారు. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే ఒంటరిగా పోటీ చేస్తుందని తేల్చి చెప్పారు. ఎన్నికలకు ముందు ఎలాంటి పొత్తులు పెట్టుకునేది లేదన్నారు. డీఎంకే, అన్నాడీఎంకే వరుస పాలనలకు మెరుగైన ప్రత్యామ్నాయంగా టీవీకేను ముందుకు తెచ్చారు.
మూడు దశాబ్దాల సినీ జీవితం, సుమారు 70 సినిమాల తర్వాత సినిమాల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. తద్వారా రాజకీయాలకు తనకు సైడ్ ప్రాజెక్ట్ కాదని, తాను పూర్తిగా రాజకీయాల్లోనే ఉండబోతున్నానని చెప్పారు. తదుపరి రెండేళ్లు అప్పటిదాకా ఉన్న సాధారణ ఫ్యాన్ వెల్ఫేర్ వ్యవస్థను పార్టీ జిల్లా కమిటీలు, నియోజకవర్గ యూనిట్లు, పోలింగ్ కేంద్రం స్థాయి టీమ్‌ల రూపానికి తెచ్చారు. అదే సమయంలో విద్య, ఉపాధి, అవినీతి వ్యతిరేకత, సంస్థాగత జవాబుదారీతనంపై కేంద్రీకరించి మాట్లాడసాగారు. సోషల్ మీడియా టౌన్ హాల్స్, భారీ బహిరంగ సభలతో క్రౌడ్‌పుల్లింగ్ చేశారు.
ఈ సమయంలో అనేక ఇబ్బందులు కూడా ఎదురయ్యాయి. కరూర్‌లో 2025లో నిర్వహించిన సభలో చోటు చేసుకున్న తీవ్ర తొక్కిసలాట ఒక దశలో తీవ్ర సంక్షోభంలోకి టీవీకేను నెట్టివేసింది. సంస్థాగత క్రమశిక్షణ, జవాబుదారీతనంపై ప్రశ్నలు లేవనెత్తింది. సీబీఐ విచారణలు ఎదుర్కొన్నారు.. ఆయన వ్యక్తిగత జీవితం ఎన్నికల సమయంలో రచ్చకెక్కింది. ఉన్నట్టుండి ఇప్పుడే ఈ అంశం ముందుకు రావడం వెనుక ఉద్దేశాలేంటి? ఎవరివి? అనే చర్చ కూడా సాగింది. ఆయన నటించిన చివరి సినిమా జన నాయగన్ విడుదలను ప్రభుత్వం అడ్డుకుంది. ఇవన్నీ ఆయనకు సవాళ్లుగా నిలిచినా.. అంతిమంగా వాటి నుంచి సానుభూతి విజయ్‌కు క్రెడిట్ ఇచ్చింది. ఈల కొడితే.. సంప్రదాయ పార్టీలకు దిమ్మతిరిగిపోయింది. తమిళ రాజకీయాల ధోరణల బూజు దులిపేసింది. మొత్తానికి విజయ్ ఒక బలమైన నాయకుడిగా రాజకీయ తెరపైకి వచ్చారు. ఈ సమయంలో మిగిలిన చిన్న ద్రవిడ పార్టీలు విజయ్‌వైపు దృష్టిసారిస్తాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Read Also |
Trisha | ఎన్నికల కౌంటింగ్ సమయంలో తిరుమలలో దర్శనమిచ్చిన త్రిష.. విజయ్ కోసం ప్రత్యేకమైన పూజలు?
మత్తు బాబులకు తెలంగాణలో షాక్.. ఫుల్‌బాటిల్‌పై కనీస బాదుడు రూ.60?
