Snake Bite | 40 రోజుల్లో ఏడు సార్లు కాటేసిన పాము.. తొమ్మిదోసారి కాటేస్తే ఎవరూ కాపాడలేరట..!
Snake Bite | నిజంగా ఇది వింత కేసే.. ఎందుకంటే ఓ 24 ఏండ్ల యువకుడు 40 రోజుల వ్యవధిలోనే ఏడు సార్లు పాము కాటు( Snake Bite )కు గురయ్యాడు. తన సొంతూరు నుంచి అత్తగారింటికి వెళ్లిన కూడా పాము కాటు తప్పలేదట. అది కూడా శని, ఆదివారాల్లోనే పాము కాటు వేసిందట. ఈ విచిత్రమైన సంఘటన గురించి తెలుసుకోవాలంటే ఉత్తరప్రదేశ్ వెళ్లాల్సిందే.

ఉత్తరప్రదేశ్ ఫతేపూర్ జిల్లాలోని సౌరా గ్రామానికి చెందిన వికాస్ దూబే అనే యవకుడిని 40 రోజుల వేర్వేరు పాములు ఏడు సార్లు కాటు వేశాయి. ప్రస్తుతం వికాస్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతడి పరిస్థితి విషమంగా ఉంది. ఏడోసారి పాము కాటు వేసినప్పుడు వికాస్ ఒక ఆశ్చర్యకరమైన విషయం బయటపెట్టాడు. తనకు ఓ కల వచ్చిందని, ఆ కలలో ఒకే పాము 9 సార్లు కాటు వేసిందని తెలిపాడు. తొమ్మిదోసారి పాము కాటు వేస్తే తనను ఎవరూ కాపాడలేరని చెప్పడం గమనార్హం. అది కూడా శనివారం రోజే అధికంగా పాము కాటుకు గురయ్యాడు. వికాస్‌నే పాములు ఎందుకు కాటు వేస్తున్నాయో తెలియడం లేదు.. దీనిపై ముగ్గురు వైద్యులతో కమిటీ ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు.
తొలిసారిగా ఈ ఏడాది జూన్ 2వ తేదీన వికాస్‌ను ఓ పాము కరిచింది. దీంతో అతన్ని ఆస్పత్రికి తీసుకెళ్లగా, వైద్యులు చికిత్స అందించడంతో బతికి పోయాడు. జూన్ 2 నుంచి జులై 6వ తేదీ వరకు అతన్ని ఆరుసార్లు పాము కరిచింది. పాము కరిచిన ప్రతిసారి ఆస్పత్రికి వెళ్లడం.. ప్రాణాలతో తిరిగి రావడం జరిగాయి. జులై 12వ తేదీన మరోసారి పాము కాటేసింది. దీంతో మొత్తం అతను ఏడు సార్లు పాము కాటుకు గురయ్యాడు.
అత్తగారింట్లో కూడా వదలని పాము..
వైద్యుల సూచన మేరకు తన అత్తగారిల్లు అయిన రాధానగర్‌కు వికాస్ వెళ్లిపోయాడు. అత్తగారింట్లో కూడా అతన్ని పాము వదిలిపెట్టలేదు. వికాస్ పాము కాటుకు గురవడం ఇది ఐదోసారి. ప్రాణాలతో బతికి బయటపడ్డ తమ కుమారుడిని పేరెంట్స్ తమ సొంతూరికి తీసుకొచ్చారు. మళ్లీ జులై 6వ తేదీన సొంతింట్లోనే పాము కరిచింది. ఈసారి కూడా అతని ఆరోగ్య పరిస్థితి విషమించినప్పటికీ ప్రాణాలతో బయటపడ్డాడు.