UPSC Prelims Result | సివిల్స్ ప్రిలిమ్స్ ఫలితాలను వెల్లడించిన UPSC.. సెప్టెంబర్‌లో మెయిన్స్ పరీక్షలు..!
UPSC Prelims Result : యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) 2024 సంవత్సరానికి సంబంధించిన సివిల్స్ ప్రిలిమ్స్(UPSC Civils Prelims Results-2024) ఫలితాలను వెల్లడించింది. ఇవాళ (సోమవారం) సాయంత్రం ఫలితాలను విడుదల చేశారు. అభ్యర్థులు upsc.gov.in వెబ్‌సైట్‌లో ఫలితాలను చెక్ చేసుకోవచ్చని యూపీఎస్సీ తెలిపింది. ఈ పరీక్షకు సంబంధించిన ప్రశ్న పత్రాలను కూడా ఇప్పటికే రిలీజ్ చేశారు.

కాగా, గత ఏడాది మే 26న సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్షను నిర్వహించి.. జూన్ 12న ఫలితాలను విడుదల చేశారు. అయితే ఈ ఏడాది జూన్ 16న సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించి.. ఇవాళ ఫలితాలను వెల్లడించారు. జూన్ 16న యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమ్స్ 2024 పరీక్షలను రెండు షిఫ్టుల్లో నిర్వహించారు. జనరల్ స్టడీస్ పేపర్-1, పేపర్-2 లకు కలిపి మొత్తం 200 మార్కులకు పరీక్ష జరిగింది. ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన అభ్యర్థులు మెయిన్స్ రాయాల్సి ఉంటుంది.
మెయిన్స్‌లో రాతపరీక్ష, పర్సనాలిటీ టెస్ట్ ఉంటుంది. షెడ్యూల్ ప్రకారం యూపీఎస్సీ సివిల్స్ మెయిన్స్ పరీక్షలు సెప్టెంబర్ 20 నుంచి జరగాల్సి ఉంటుంది. ఫలితాల కోసం ముందుగా యూపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయాలి. తర్వాత యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ (ప్రిలిమినరీ) రిజల్ట్-2024 లింకుపై క్లిక్ చేయాలి. కొత్తపేజీ ఓపెన్ కాగానే అభ్యర్థి వివరాలను నమోదుచేసి సబ్‌మిట్ బటన్‌పై నొక్కాలి. దాంతో మీ ఫలితాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram