‘వందేమాతరం’ బిల్లుకు లోక్ సభ ఆమోదం

వందేమాతరం గేయాన్ని అవమానించడం లేదా ఆలాపనకు ఆటంకం కలిగించడాన్ని నేరంగా పరిగణించే సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. రాష్ట్రపతి ఆమోదం తర్వాత ఇది చట్టంగా మారనుంది.

జాతీయ గీతం వందేమాతరంపై కేంద్రం ప్రవేశ పెట్టిన సవరణ బిల్లు లోక్‌సభలో ఆమోదం పొందింది. మూజువాణి ఓటుతో సభ్యులు బిల్లును ఆమోదించారు. ఇప్పటికే ఈ బిల్లు రాజ్యసభలో కూడా ఆమోదం పొందింది. వందేమాతర గేయాన్ని అవమానించినా, ఆలపిస్తుండగా ఆటంకం కలిగించినా నేరంగా పరిగణించేందుకే కేంద్రం ఈ బిల్లును తీసుకొచ్చింది. వందేమాతరం బిల్లులో భాగంగా ది ప్రివెన్షన్‌ ఆఫ్‌ ఇన్సల్ట్స్‌ టు నేషనల్‌ ఆనర్‌-1971లో సవరణలు చేయాలని కేంద్రం ప్రతిపాదించింది.

ప్రస్తుతం జాతీయ గీతమైన జనగణమనకు ఉన్న చట్టపరమైన రక్షణను వందేమాతరానికీ వర్తింపజేయడమే ఈ బిల్లు ప్రధాన ఉద్దేశం. రాష్ట్రపతి ఆమోదం పొందిన తర్వాత ఇది చట్టంగా మారనుంది. ఈ బిల్లుపై ఓటింగ్‌ ముగిసిన తర్వాత స్పీకర్‌ ఓం బిర్లా లోక్ సభను రేపటికి వాయిదా వేశారు. మరోవైపు లోక్ సభలో ఆమోదం పొందిన యాంటీ పేపర్ లీక్ బిల్లుపై రాజ్యసభలో చర్చ కొనసాగుతుంది. ఏడు గంటల చర్చ ముగిశాక ఓటింగ్ జరుగనుంది.

Latest News