విజయ్ తొలి ప్రసంగం..నేనే పవర్ సెంటర్

నా ప్రభుత్వంలో నేనే పవర్ సెంటర్ అని, ఇంకో పవర్ సెంటర్ ఉండదని టీవీకే చీఫ్, తమిళనాడు సీఎం చంద్రశేఖర్ జోసెఫ్ విజయ్ స్పష్టం చేశారు.

విధాత : నా ప్రభుత్వంలో నేనే పవర్ సెంటర్ అని, ఇంకో పవర్ సెంటర్ ఉండదని టీవీకే చీఫ్, తమిళనాడు సీఎం చంద్రశేఖర్ జోసెఫ్ విజయ్ స్పష్టం చేశారు. సీఎంగా ప్రమాణ స్వీకారం అనంతరం ఆయన 200యూనిట్ల ఉచిత విద్యుత్ పైన తొలి సంతకం చేశారు. రెండో సంతకాన్ని మహిళ భద్రత కోసం షీటీమ్స్ తరహా నిఘా వ్యవస్థ ఏర్పాటుపైన, మూడో సంతకాన్ని డ్రగ్స్ కట్టడికి ఈగల్ తరహా డ్రగ్ నిరోధక వ్యవస్థ ఏర్పాటుపైన చేశారు. అనంతరం సీఎంగా తన తొలి ప్రసంగం చేశారు.

టీవీకే నాయకులు అహంకారంతో వ్యవహరించవద్దు..

నా పార్టీ నాయకులు ఎవరు అహంకారంతో వ్యవహరించవద్దని విజయ్ స్పష్టం చేశారు. పార్టీ కార్యకర్తలు, అభిమానుల వల్లే ఈ విజయం దక్కిందని వారికి రుణపడి ఉంటానన్నారు. తమిళనాడు నా ప్రభుత్వ ఏర్పాటుతో కొత్త శకం ప్రారంభమైందని,లౌకిక. సామాజిక న్యాయం జరుగుతుందని తెలిపారు. నా పాలన పూర్తి పారదర్శకంగా కొనసాగుతుందని, ప్రజాధనాన్ని వృధా చేయను.. దోచుకోవడం ఉండదని స్పష్టం చేశారు. డ్రగ్స్ పోరాటం ఈ రోజు నుంచే కొనసాగుతుందన్నారు.

విజయ్ మామ అండగా ఉంటాడు..

విద్యార్థుల భవిష్యత్తుకు విజయ్ మామ అండగా ఉంటాడు అని సీఎం విజయ్ భరోసా ఇచ్చారు. మైనార్టీలకు అండగా ఉంటానన్నారు. సినిమాలో నన్ను ఉన్నత స్థాయిలో నిలిపారని.. తమ్ముడా అంటూ పిలిచారు కాబట్టి రాజకీయాల్లోకి వచ్చానని ఈ సందర్బంగా విజయ్ తెలిపారు. నేను జీవితంలో చాలా కష్టాలు అనుభవించానని, ఆకలి బాధలు ఏమిటో నాకు తెలుసు అన్నారు. నేను మీ కుటుంబ సభ్యుడు లాంటి వాడిని అని, నా ప్రయాణంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నానని, నాకు ఎన్ని అవమానాలు ఎదురైనా మీరే అండగా ఉన్నారని విజయ్ చెప్పుకొచ్చారు.

రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేత పత్రం

తమిళనాడు ఆర్థిక పరిస్థితి పై త్వరలో శ్వేత పత్రం ప్రకటిస్తానన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 10 లక్షల కోట్ల అప్పులో ఉందని గుర్తు చేశారు.

విజయ్ సర్కార్ కు కేంద్ర సహకారం : ప్రధాని మోదీ

తమిళనాడు సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన విజయ్‌కు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. విజయ్‌ పదవీకాలం విజయవంతం కావాలని ఆకాంక్షించారు. తమిళనాడు ప్రభుత్వానికి అన్ని రకాలుగా కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుందని తెలిపారు. బెంగళూరు పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ అక్కడి నుంచి మధ్యాహ్నం హైదరాబాద్‌కు చేరుకుంటారు.

Latest News