female SI undercover| ఆకతాయిల భరతం పట్టెందుకు విద్యార్థినిగా మహిళా ఎస్సై !

రాజ్యంలో ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు గతంలో రాజులు మారువేషాలలో పర్యటించేవారని కథనం. అలాగే ఓ మహిళా ఎస్సై కూడా అమ్మాయిలను వేధించే ఆకతాయిల భరతం పట్టేందుకు తనే స్వయంగా విద్యార్థినిగా మారిపోయింది.

Reported by: Y.V. Narsimha Reddy | తెలంగాణ‌ | Mar 29, 2026, 4:24 pm IST
Read Time: 3 mins
female SI undercover| ఆకతాయిల భరతం పట్టెందుకు విద్యార్థినిగా మహిళా ఎస్సై !

విధాత, హైదరాబాద్ : రాజ్యంలో ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు గతంలో రాజులు మారువేషాలలో పర్యటించేవారని కథనం. అలాగే ఓ మహిళా ఎస్సై కూడా అమ్మాయిలను వేధించే ఆకతాయిల భరతం పట్టేందుకు తనే స్వయంగా విద్యార్థినిగా మారిపోయింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మహిళా ఎస్సై అమూల్య పరీక్ష కేంద్రాల వద్ద విద్యార్థినిలను వేధించే ఆకతాయిలను గుర్తించేందుకు ఒక వినూత్న పద్ధతిని అవలంబించారు. తనే స్వయంగా విధ్యార్థిని వేషం కట్టారు. ఖాకీ యూనిఫాం వదిలి, ఎరుపు రంగు డ్రెస్సులో చేతిలో పుస్తకాలు పట్టుకుని సాధారణ విద్యార్థిని (స్టూడెంట్ గెటప్) గా పరీక్ష కేంద్రం వద్ద ప్రత్యక్ష మయ్యారు. ఆమె సాధారణ విద్యార్థిని వేషధారణలో పరీక్షా కేంద్రం వద్ద నిఘా నిర్వహించారు.

పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థినులను వేధిస్తున్న ఆకతాయిల ఆట కట్టించేందుకు ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు. అసలు విషయం తెలుసుకున్న స్థానికులు, విద్యార్థినిలు ఎస్సై అమూల్య నిర్ణయాన్ని, ధైర్యాన్ని, సమయస్ఫూర్తిని అభినందిస్తున్నారు. ఇది ఆకతాయిలకు ఒక గట్టి హెచ్చరిక అని వారు పేర్కొంటున్నారు. అమూల్య అనుసరించినటువంటి నిఘా వ్యూహాలు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడేవారికి ఒక గట్టి హెచ్చరికగా అభివర్ణించారు. విద్యార్థినులలో భద్రతా భావాన్ని పెంచడంతో పాటు, పరీక్షల వాతావరణం ప్రశాంతంగా ఉండేందుకు దోహదపడతాయని అభినందించారు. ఎస్సై అమూల్య తరహా నిఘా వ్యూహాలను ఇప్పటికే షీటీమ్స్ మహిళా సిబ్బంది నగరాల్లోని మెట్రో రైళ్లలో, ఎగ్జిబిషన్లు, పార్కులలో అనుసరిస్తున్న సంగతి తెలిసిందే.