Vijay Rupani | నంబ‌ర్ 12తో విజ‌య్ రూపానికి విడ‌దీయ‌రాని అనుబంధం.. దుర‌దృష్ట సంఖ్యగా మారిన అదృష్ట సంఖ్య‌

Vijay Rupani | రాజ‌కీయ నాయ‌కులకు( Political Leaders ) సెంటిమెంట్లు ఎక్కువే. ఎందుకంటే వారు వినియోగించే కారు నంబ‌ర్ ప్లేట్( Number Plate ) నుంచి రాజ‌కీయంగా వారు తీసుకునే నిర్ణ‌యాల వ‌ర‌కు ఒక క‌చ్చిత‌మైన నంబ‌ర్‌ను ఫాలో అవుతుంటారు. అంటే త‌మ‌కు ల‌క్కీ( Lucky ) అనిపించే ఒక నంబ‌ర్‌ను ఫాలో అవుతూ.. కార్య‌క్ర‌మాలు చేప‌డుతుంటారు. కానీ అదే అదృష్ట సంఖ్య‌( Lucky Number ).. గుజరాత్ మాజీ సీఎం విజ‌య్ రూపాని( Vijay Rupani ) విష‌యంలో దుర‌దృష్ట సంఖ్య‌గా మారింది. మ‌రి విజ‌య్ రూపాని అదృష్ట సంఖ్య‌.. ఆ క‌థేంటో తెలుసుకుందాం..

  • By: raj |    national |    Published on : Jun 13, 2025 9:37 AM IST
Vijay Rupani | నంబ‌ర్ 12తో విజ‌య్ రూపానికి విడ‌దీయ‌రాని అనుబంధం.. దుర‌దృష్ట సంఖ్యగా మారిన అదృష్ట సంఖ్య‌

Vijay Rupani | గుజరాత్ మాజీ ముఖ్య‌మంత్రి( Gujarat Ex CM ), బీజేపీ నాయ‌కుడు విజ‌య్ రూపాని( Vijay Rupani ) ఎయిరిండియా విమాన ప్ర‌మాదం( Air India Plane Crash )లో ప్రాణాలు కోల్పోయిన సంగ‌తి తెలిసిందే. విజ‌య్ రూపాని మృతితో గుజ‌రాత్‌( Gujarat )లో, భార‌తీయ జ‌న‌తా పార్టీ( BJP )లో విషాద‌ఛాయ‌లు అలుముకున్నాయి. ఆయ‌న‌తో అనుబంధాన్ని గుజరాతీలు నెమ‌రేసుకుంటున్నారు.

గుజ‌రాత్ మాజీ సీఎం విజ‌య్ రూపానికి నంబ‌ర్ 12( Number 12 )తో విడ‌దీయ‌రాని అనుంబంధం ఉంద‌ని గుర్తు చేసుకుంటున్నారు. రూపాని ల‌క్కీ నంబ‌ర్ 12 కాగా, అదే నంబ‌ర్ క‌లిగిన తేదీన అంటే జూన్ 12( June 12 )న ఆయ‌న ప్రాణాలు కోల్పోవ‌డం విచార‌క‌ర‌మ‌ని పేర్కొన్నారు. మాజీ సీఎంకు సంబంధించిన ప్ర‌తి వాహ‌నానికి రిజిస్ట్రేష‌న్ నంబ‌ర్( registration Number ) 1206 ఉంటుంది. 12 – 06( జూన్ 12) రోజున ఆయ‌న చ‌నిపోవ‌డం బాధాక‌ర‌మ‌ని అభిమానులు పేర్కొన్నారు. అదృష్ట సంఖ్య( Lucky Number ).. దుర‌దృష్ట సంఖ్య‌గా మార‌డం మ‌న‌సును క‌లిచి వేస్తుంద‌న్నారు.

ఇక అహ్మ‌దాబాద్ నుంచి లండ‌న్ బ‌య‌ల్దేరిన ఎయిరిండియా విమానంలోనూ విజ‌య్ రూపాని సీట్ నంబ‌ర్ 12. ఆయ‌న బోర్డింగ్ టైమ్ కూడా 12:10. దీన్ని బ‌ట్టి చూస్తుంటే.. ఆయ‌న ఎంతో అదృష్టంగా భావించే నంబ‌ర్ 12.. ప్ర‌తి క్ష‌ణం ఆయ‌న‌ను అనుస‌రించింది. కానీ చివ‌ర‌కు అదే నంబ‌ర్ ఆయ‌న‌ను బ‌లితీసుకుంది.