విధాత : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అధికార డీఎంకే, ప్రతిపక్ష అన్నాడీఎంకే కూటములను ఒంటరిగా ఢీకొడుతున్న టీవీకే పార్టీ అధ్యక్షుడు, సినీ హీరో విజయ్ ఎన్నికల్లో పోటీపై అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. తన వ్యక్తిగత కారు డ్రైవర్ రాజేంద్రన్ కుమారుడు శబరినాథన్‌కు విరుగంపాక్కం ఎమ్మెల్యే టికెట్‌ను విజయ్ కేటాయించారు.
వేదికపై విజయ్ విరుగంపాక్కం టీవీకే అభ్యర్థిగా తనను పరిచయం చేస్తున్న క్రమంలో శబరినాథన్, ఆయన తండ్రి భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ దృశ్యం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
రెండు చోట్ల విజయ్ పోటీ
తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల బరిలో టీవీకే తరఫున బరిలో నిలవనున్న అభ్యర్థుల జాబితాను ఆ పార్టీ అధ్యక్షుడు విజయ్ వెల్లడించారు. స్వయంగా విజయ్ పెరంబూర్, తిరుచ్చి ఈస్ట్ నుంచి పోటీ చేయనున్నారు. చెన్నైలో జరిగిన సభలో ఆయన ఈ విషయాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా అభ్యర్థులను పరిచయం చేశారు.
#TVKChief విజయ్ అరుదైన నిర్ణయం
తన వ్యక్తిగత కారు డ్రైవర్ రాజేంద్రన్ కుమారుడు శబరినాథన్‌కు విరుగంపాక్కం ఎమ్మెల్యే టికెట్‌ను విజయ్ ఖరారు చేశారు
వేదికపై #TVKVijay తనను అభ్యర్థిగా పరిచయం చేస్తున్న క్రమంలో శబరినాథన్ మరియు ఆయన తండ్రి భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకున్నారు pic.twitter.com/tWyIcddgCk
— greatandhra (@greatandhranews) March 29, 2026
