Pappu Chiawala | మొన్న డాలీచాయ్‌వాలా.. ఇప్పుడు పప్పు చాయ్‌వాలా.. సోషల్ మీడియాలో ట్రెండింగ్..!
Pappu Chiawala | ప్రస్తుత కాలం సోషల్ మీడియా క్రేజ్ విపరీతంగా పెరిగింది. ఇది సామాన్యులను ఓవర్‌నైట్‌లోనే సెలబ్రెటీలుగా మార్చేస్తుంది. నిత్యం సోషల్ మీడియాలో ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. కొందరు తాము చేస్తున్న పనులతో అందరి దృష్టిని ఆకర్షిస్తుంటారు. గత కొద్దిరోజుల కిందట ‘డాలీ చాయ్‌వాలా’ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాడు.
Pappu Chiawala | ప్రస్తుత కాలం సోషల్ మీడియా క్రేజ్ విపరీతంగా పెరిగింది. ఇది సామాన్యులను ఓవర్‌నైట్‌లోనే సెలబ్రెటీలుగా మార్చేస్తుంది. నిత్యం సోషల్ మీడియాలో ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. కొందరు తాము చేస్తున్న పనులతో అందరి దృష్టిని ఆకర్షిస్తుంటారు. గత కొద్దిరోజుల కిందట ‘డాలీ చాయ్‌వాలా’ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాడు. అతనికి సంబంధించి వీడియోలు తెగ వైరల్ అయ్యాయి. ఇటీవల మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ భారత్‌కు వచ్చిన సమయంలో అతని వద్ద చాయ్ తాగి వెళ్లడం విశేషం.
తాజాగా మరో చాయ్‌వాలా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాడు. ఆయనే పప్పు చాయ్‌వాలా. గుజరాత్ రాష్ట్రం సూరత్ నగరంలోని న్యూసిటీ లైట్ రోడ్ ప్రాంతంలో ఈ పప్పూ చాయ్‌వాలా టీ దుకాణం ఉన్నది. అయితే, ఆయన పాల ప్యాకెట్లను గాల్లో పైకి ఎగరవేస్తూ పట్టుకోవడంతో పాటు పాల పాకెట్ కవర్ చింపి పాలను దూరం నుంచి గిన్నెలో పోయవడం తదితర సీన్స్ ఆయనను యాక్షన్ చాయ్‌వాలాగా పేరు తీసుకువచ్చింది. ఈ చాయ్ వాలా టీ స్పెషల్‌గా కనిపిస్తున్నది. పాలల్లో పుదీనా, లెమన్ గ్రాస్, అల్లం, టీ పొడి వేసి చాయ్‌ని మరగబెట్టాడు. ఆ తర్వాత అందులో చెక్కెరతో పాటు మరికొన్ని పదార్థాలు వేశాడు. చివరకు అవన్నీ వడగట్టి టీని అందరికీ సర్వ్ చేశారు.
ప్రస్తుతం ఈ టీ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. జిల్ భువా అను ఫుడ్ బ్లాగర్ ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయగా ట్రెండింగ్ మారింది. ఇప్పటి వరకు 42 మిలియన్లకుపైగా వ్యూస్, లక్షల్లో వచ్చాయి. వీడియోను చూసిన పలువురు నెజిటన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ‘ఈ చాయ్‌వాలా కూడా బిల్ గేట్స్‌ని కలవాలని అనుకుంటున్నాడని కొందరు.. ఈ సారి ఏకంగా ఎలాన్ మస్క్ వచ్చి టీ తాగుతాడని మరికొందరు కామెంట్స్ చేశారు. పోటీ పెరగడంతో కస్టమర్లను ఆకట్టుకునేందుకు ఏదో ఒక స్పెషల్‌గా ఉండాలని ఇలా చేయాల్సి వస్తుందని మరికొందరు స్పందించారు.
View this post on Instagram
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram