Bihar Elections | బీహార్‌లో తొలి విడుత ఎన్నిక‌ల పోలింగ్ ప్రారంభం

Bihar Elections | బీహార్‌లో తొలి విడుత ఎన్నిక‌ల పోలింగ్ ప్ర‌క్రియ ప్రారంభ‌మైంది. మొద‌టి ద‌శ పోలింగ్‌లో భాగంగా 18 జిల్లాల ప‌రిధిలోని 121 నియోజ‌క‌వ‌ర్గాల్లో ప్ర‌శాంతంగా పోలింగ్ కొన‌సాగుతోంది.

  • By: raj |    national |    Published on : Nov 06, 2025 7:28 AM IST
Bihar Elections | బీహార్‌లో తొలి విడుత ఎన్నిక‌ల పోలింగ్ ప్రారంభం

Bihar Elections | పాట్నా : బీహార్‌లో తొలి విడుత ఎన్నిక‌ల పోలింగ్ ప్ర‌క్రియ ప్రారంభ‌మైంది. మొద‌టి ద‌శ పోలింగ్‌లో భాగంగా 18 జిల్లాల ప‌రిధిలోని 121 నియోజ‌క‌వ‌ర్గాల్లో ప్ర‌శాంతంగా పోలింగ్ కొన‌సాగుతోంది. 121 అసెంబ్లీ స్థానాల్లో 1,314 మంది అభ్య‌ర్థులు బ‌రిలో ఉన్నారు. 3.75 కోట్ల మంది ఓటర్లు త‌మ ఓటు హ‌క్కును వినియోగించుకోనున్నారు. 45,341 పోలింగ్ కేంద్రాల‌ను ఏర్పాటు చేశారు. ప్ర‌తి పోలింగ్ కేంద్రం వ‌ద్ద పోలీసులు ప‌టిష్ట బందోబ‌స్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛ‌నీయ ఘ‌ట‌న‌లు చోటు చేసుకోకుండా పోలీసులు చ‌ర్య‌లు తీసుకుంటున్నారు.

జేడీయూ 57, బీజేపీ 48, ఎల్‌జేపీ 14, ఆర్ఎల్ఎం 2 స్థానాల్లో పోటీ చేస్తుంది. ఆర్జేడీ 73, కాంగ్రెస్ 24, సీపీఐ-ఎంఎల్ 14 చోట్ల పోటీ చేస్తోంది. ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిషోర్ సార‌థ్యంలోని జ‌న్‌సురాజ్ పార్టీ నుంచి 119 మంది బ‌రిలో దిగారు. ఈ తొలి విడుత ఎన్నిక‌ల్లో తేజ‌స్వీ యాద‌వ్‌తో పాటు బీజేపీ నేత సామ్రాట్ చౌద‌రి, ఇద్ద‌రు డిప్యూటీ సీఎంలు, 14 మంది మంత్రులు పోటీలో ఉన్నారు.