Lok Sabha Elections | చివరి దశ ఎన్నికలకు పోలింగ్ ప్రారంభం.. సాయంత్రం 6.30 తర్వాత ఎగ్జిట్ పోల్స్..
Lok Sabha Elections | దేశంలో సార్వత్రిక ఎన్నికల సమరం చివరి దశకు చేరుకుంది. చివరి దశ ఎన్నికల పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగనుంది. ఏప్రిల్ 19న తొలి దశ ఎన్నికలు జరిగాయి. నేటితో ఏడో దశ ఎన్నికలకు పోలింగ్‌తో సార్వత్రిక ఎన్నికల పర్వం ముగియనుంది.

Lok Sabha Elections | న్యూఢిల్లీ : దేశంలో సార్వత్రిక ఎన్నికల సమరం చివరి దశకు చేరుకుంది. చివరి దశ ఎన్నికల పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగనుంది. ఏప్రిల్ 19న తొలి దశ ఎన్నికలు జరిగాయి. నేటితో ఏడో దశ ఎన్నికలకు పోలింగ్‌తో సార్వత్రిక ఎన్నికల పర్వం ముగియనుంది. సాయంత్రం 6.30 గంటల తర్వాత ఎగ్జిట్ పోల్స్ విడుదల కానున్నాయి.
ఈ దశలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్రమంత్రులు అనురాగ్ ఠాకూర్, ఆర్కే సింగ్, మహేంద్ర నాథ్ పాండే, పంకజ్ చౌదరీ, అనుప్రియా పటేల్, నటి కంగనా రనౌత్, లాలు కుమార్తె మీసా భారతితో పాటు పలువురు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
కేంద్ర పాలిత ప్రాంతం ఛండీఘర్‌తో పాటు ఏడు రాష్ట్రాలలోని 57 లోక్‌సభ సీట్లకు చివరి దశలో ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 904 మంది అభ్యర్ధులు రంగంలో ఉన్నారు. ఏడో దశలో యూపీలో13 లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరగున్నాయి. బీహార్‌లోని 8, పశ్చిమ బెంగాల్‌లో 9, జార్ఖండ్ 3, పంజాబ్ 13, హిమాచల్ ప్రదేశ్ 4, ఒడిశా 6 లోక్ సభ స్థానాలతో పాటు 42 అసెంబ్లీ సీట్లకు ఎన్నికలు జరగనున్నాయి. అటు కేంద్ర పాలిత ప్రాంతం చండీఘర్‌కు ఈ విడతతోనే ఎన్నికల ప్రక్రియ పూర్తవుతోంది. పంజాబ్ నుంచి అత్యధికంగా 328 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా..ఆ తర్వాత యూపీలో 144 మంది , బిహార్‌లో 134, ఒడిశాలో 66, జార్ఖండ్‌లో 52, హిమాచల్‌ప్రదేశ్‌లో 37, ఛండీఘర్ నుంచి నలుగురు అభ్యర్థులు బరిలో నిలిచారు.