Street Dogs | వేసవి కాలంలో వీధికుక్కలు ఎందుకు ఎక్కువగా కరుస్తాయి? వెటర్నరీ డాక్టర్లు ఏం చెబుతున్నారు?
వేసవికాలం మొదలైతే కుక్కలు ఎందుకంత రెచ్చిపోతాయి? కనబడిన వారిపై అరవడం, కరవడం ఎందుకు చేస్తాయి? వీటన్నింటికీ కారణాలు ప్రముఖ వెటర్నరీ వైద్య నిపుణులు డాక్టర్ వరుణ్ మెహతా వివరించారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
Street Dogs | తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా వీధి కుక్కల దాడులు భయాందోళనలకు గురిచేస్తున్నాయి. ఇటీవల పలు ప్రాంతాల్లో చిన్న పిల్లలపై కుక్కల దాడుల ఘటనలు మరింత భయపెట్టిస్తూనే ఉన్నాయి. అసలు వేసవికాలం మొదలైతే కుక్కలు ఎందుకంత రెచ్చిపోతాయి? కనబడిన వారిపై అరవడం, కరవడం ఎందుకు చేస్తాయి? వాటి ప్రవర్తనలో ఎందుకంత మార్పు వస్తుంది? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలను ప్రముఖ వెటర్నరీ వైద్య నిపుణులు డాక్టర్ వరుణ్ మెహతా వివరించారు. మరి ఆ కారణాలంటే ఇప్పుడు తెలుసుకుందాం..
సమ్మర్‌లో కుక్కల ప్రవర్తన ఎందుకు మారుతుంది?
ప్రముఖ వెటర్నరీ వైద్య నిపుణుడు డాక్టర్ వరుణ్ మెహతా తెలిపిన దాని ప్రకారం.. మనుషులకు ఉన్నట్లుగా కుక్కలకు చెమట గ్రంథులు ఎక్కువగా ఉండవు. దీంతో అవి శరీర ఉష్ణోగ్రతను సులభంగా నియంత్రించలేవు. ముఖ్యంగా వేసవిలో వేడి, నీటి కొరత, ఆహారం అందుబాటులో లేకపోవడం వల్ల కుక్కల్లో చిరాకు, అసహనం పెరుగుతుంటాయి. దీర్ఘకాలం వేడి ఉండటం వల్ల వాటిలో అలసట, అసౌకర్యం పెరిగి కోపంగా తయారవుతుంటాయి. ఇదే సమయంలో సాయంత్రంపూట ఇళ్లలో నుంచి బయటకు వచ్చే సంఖ్య కూడా పెరుగుతుంది. దీంతో అవి మనుషులు కనబడగానే కరిచే అవకాశం ఉంటుంది.
ఒత్తిడికి కారణాలివే..
మామూలు సీజన్‌తో పోలిస్తే వీధి కుక్కలు వేసవికాలంలో మరింత ఒత్తిడిని ఎదుర్కొంటాయి. నీరు, ఆహారం కొరత, విశ్రాంతి తీసుకునే ప్రదేశాల కొరత ఏర్పడుతుంది. పరిమిత వనరులు ఉండటంతో వీధి కుక్కల మధ్య పోటీతత్వం పెరుగుతుంది. తమ పరిధిని కాపాడుకునేందుకు మరింత రక్షణాత్మకంగా మారుతుంటాయి. ఇదే సమయంలో మనుషులు దగ్గరకు వెళ్లడం, తరిమివేయడం వంటివి చేసినప్పుడు రక్షణ కోసం అవి దాడికి దిగుతుంటాయి.
నిపుణులు గుర్తించిన మరికొన్ని ముఖ్య కారణాలు
* వీధి కుక్కల కళ్లలోకి నేరుగా చూడకూడదు. దీన్ని అవి సవాలుగా భావిస్తాయి.
* వీధి కుక్కల ముందు పరిగెత్తడం, చేతులు ఊపడం వంటివి చేయకూడదు.
* భయపెట్టడానికి గట్టిగా అరిచినా కుక్కలకు ఆగ్రహం పెరుగుతుంది.
* కుక్కలు ఉండే ప్రదేశాల్లోకి వెళ్లడం లేదా వాటి ఆహారం, నీటికి అడ్డంకులు కల్పించడం. కాబట్టి ముఖ్యంగా ఈ సమ్మర్‌లో అలాంటి పనులు చేయకుండా జాగ్రత్తగా ఉండటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
ఒక కుక్క దాడి చేయగానే.. మిగతావి ఎందుకొస్తాయి.
కుక్కలు సహజంగానే గుంపులుగా జీవించే జంతువులు. అడవుల్లో ఉన్నప్పుడు వేట, రక్షణ కోసం ఈ లక్షణం ఉపయోగపడుతుంది. నగరాల్లోనూ ఇదే స్వభావం కొనసాగుతుంది. దీంతో ఒక కుక్క ప్రమాదాన్ని గుర్తించి స్పందిస్తే.. మిగతావి కూడా వెంటనే స్పందిస్తాయి. దీన్నే సోషల్ ఫెసిలిటేషన్ అని అంటారు. అందుకే ఒంటరిగా ఉన్న కుక్క వెనక్కి తగ్గవచ్చు. కానీ గుంపులుగా ఉన్నప్పుడు ఎక్కువగా దాడి చేసే అవకాశం ఉంటుంది. అందుకే కుక్కలు గుంపులుగా ఉన్నప్పుడు వాటి దగ్గర నుంచి వెళ్లకపోవడమే మంచిది.
కుక్కలు కరిస్తే ఏం చేయాలి?
* కుక్క కరిచిన వెంటనే గాయాన్ని సబ్బు, మంచి నీటితో కనీసం 10 నుంచి 15 నిమిషాల పాటు కడగాలి. దీనివల్ల రేబిస్ వైరస్ వచ్చే ప్రమాదం తగ్గుతుంది.
* గాయం శుభ్రపరిచిన తర్వాత యాంటిసెప్టిక్ క్రీమ్ రాయాలి.
* ఆ వెంటనే ఆలస్యం చేయకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. యాంటీ రేబిస్ వ్యాక్సిన్ తగిన డోసులు వేయించుకోవాలి.
* కుక్క పంటి గాటు పడినా.. చర్మంపై చిన్న గీత పడినా వ్యాక్సిన్ వేయించుకోవడం బెటర్.
* కుక్క కరిచిన గాయాలకు బ్యాండేజ్, కుట్లు వేయకూడదు. అలా చేస్తే రేబిస్ వైరస్ గాయం లోపలే ఉండిపోయే ప్రమాదం ఉంది.
Read More:
68 కోట్ల కట్నం ఇచ్చి.. పాతికేళ్ల కుర్రాడిని పెళ్లి చేసుకున్న 55 ఏళ్ల మహిళ
మరణానికి ముందే శవపేటికలో గడుపుతున్న యువత.. ఏంటీ ఈ ట్రెండ్!
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram