Z Plus Security | ఆ చిన్నారికి జ‌డ్ ప్ల‌స్ సెక్యూరిటీ.. అదేదో భ‌ద్ర‌తా బ‌ల‌గాల‌తో కాదండోయ్.. వీడియో

Z Plus Security | ఓ ఆరేడు ఏండ్ల వ‌య‌సు ఆమెది. కానీ ఆమెకు జ‌డ్ ప్ల‌స్ భ‌ద్ర‌త(Z Plus Security ) క‌ల్పించారు. మ‌రి జ‌డ్ ప్ల‌స్ సెక్యూరిటీ అంటే భ‌ద్ర‌తా బ‌ల‌గాల‌తో కాదండోయ్.. వీధి శున‌కాలతో( Street Dogs ).. మీరు ఆ వీడియో( Viral Video ) చూస్తే ఆశ్చ‌ర్య‌పోవాల్సిందే.

  • By: raj |    national |    Published on : May 25, 2025 8:18 AM IST
Z Plus Security | ఆ చిన్నారికి జ‌డ్ ప్ల‌స్ సెక్యూరిటీ.. అదేదో భ‌ద్ర‌తా బ‌ల‌గాల‌తో కాదండోయ్.. వీడియో

Z Plus Security | సాధార‌ణంగా జ‌డ్ ప్ల‌స్ సెక్యూరిటీ(Z Plus Security ).. దేశంలోని ప్ర‌ముఖుల‌కు క‌ల్పిస్తారు. జ‌డ్ ప్ల‌స్ సెక్యూరిటీ క‌లిగి ఉన్న వారికి బుల్లెట్ ప్రూఫ్ కారు( Bullet Proof Car ), న‌లువైపులా భ‌ద్ర‌తా బ‌ల‌గాలు( Security Forces ), వెనుక ముందు భారీ కాన్వాయ్.. జామర్ వాహ‌నాలు ఉంటాయి. ఓ చిన్నారి( Girl Child )కి కూడా ఆ మాదిరి జ‌డ్ ప్ల‌స్ సెక్యూరిటీ(Z Plus Security ) క‌ల్పించారు. అదేదో భ‌ద్ర‌తా బ‌ల‌గాలు అనుకుంటే ప‌ప్పులో కాలేసిన‌ట్టే.. ఆ చిన్నారికి వీధి శున‌కాలు( Street Dogs ) జ‌డ్ ప్ల‌స్ సెక్యూరిటీ భ‌ద్ర‌త క‌ల్పించాయి. ఈ వీడియో ఎంతో క్యూట్‌గా ఉంది. నెటిజ‌న్లను ఎంతో ఆక‌ట్టుకుంది.

ఓ చిన్నారి( Girl Child ) ర‌ద్దీ రోడ్డుపై స‌ర‌దాగా వెళ్తుంది.. ఆ పాప వెంట శున‌కాలు కూడా ఉన్నాయి. ఇక తెలుపు రంగులో ఓ శున‌కంపై బాలిక కూర్చోగా.. అది నిదానంగా ముందుకు క‌దులుతూ రోడ్డు క్రాస్ చేస్తుంది. ఆ చిన్నారిని అనుస‌రిస్తూ మ‌రో ఆరేడు కుక్క‌లు( Dogs ) ముందుకు క‌దిలాయి. వాహ‌నాలు వేగంగా దూసుకెళ్తున్న ర‌హ‌దారిపై ఆ చిన్నారిని సుర‌క్షితంగా తీసుకెళ్లిన దృశ్యం ఎంతో ఆక‌ట్టుకుంటుంది.

మామూలుగా కుక్క‌లకు చిన్నారులు క‌నిపిస్తే చాలు.. అమాంతం దాడి చేసి తీవ్రంగా గాయ‌ప‌రుస్తాయి. కానీ ఈ వీధి కుక్క‌లు మాత్రం ఆ పాప‌కు క‌ల్పించిన భ‌ద్ర‌త చూస్తే ఆశ్చ‌ర్య‌మేస్తుంది. ఆ బాలిక‌తో ఆ వీధి కుక్క‌లు ఎంతో స్నేహంగా ఉంటే కానీ.. ఇలాంటి సంఘ‌ట‌న ఆవిష్కృతం కాదు. వీధి శున‌కాలు కూడా ఆ చిన్నారితో స‌ర‌దాగా ఎంజాయ్ చేశాయి.