ఏపీపీఎస్సీ లో జరిగిన అక్రమాలపై సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలి

తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాగల ఆనంద్ గౌడ్ పాదయాత్రలో జగన్ రెడ్డి గారు నేను విన్నాను…నేను ఉన్నాను అన్నారు.అధికారంలోకి రాగానే నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు అన్నారు.ఉద్యోగాలు లేవు కదా ఆఖరికి ఉన్న కంపెనీలు కూడా పోతున్న పరిస్థితి.చంద్రబాబు గారి హయాంలో విదేశీ పెట్టుబడుల ఆకర్షించడంలో రాష్ట్రం 3,4 స్థానాల్లో ఉంటే జగన్ రెడ్డి పాలనలో పెద్ద రాష్ట్రాల జాబితాలో చివరి స్థానంలో ఉంది. ఏపీపీఎస్సీ ని గుండు సున్నా చేసారు,డిఎస్సి జీరో, పోలీస్ రిక్రూట్మెంట్ […]

ఏపీపీఎస్సీ లో జరిగిన అక్రమాలపై సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలి

తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాగల ఆనంద్ గౌడ్

పాదయాత్రలో జగన్ రెడ్డి గారు నేను విన్నాను…నేను ఉన్నాను అన్నారు.అధికారంలోకి రాగానే నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు అన్నారు.ఉద్యోగాలు లేవు కదా ఆఖరికి ఉన్న కంపెనీలు కూడా పోతున్న పరిస్థితి.
చంద్రబాబు గారి హయాంలో విదేశీ పెట్టుబడుల ఆకర్షించడంలో రాష్ట్రం 3,4 స్థానాల్లో ఉంటే జగన్ రెడ్డి పాలనలో పెద్ద రాష్ట్రాల జాబితాలో చివరి స్థానంలో ఉంది.
 ఏపీపీఎస్సీ ని గుండు సున్నా చేసారు,డిఎస్సి జీరో, పోలీస్ రిక్రూట్మెంట్ నిర్వీర్యం చేసారు. ఇప్పుడు
 గ్రూప్ 1 పై జగన్మోహన్ రెడ్డి కన్నుపడింది.
 కుక్క పిల్ల,అగ్గిపుల్ల,సబ్బు బిళ్ళ కాదేది కవిత కు అనర్హం అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారికి ఇసుక ,మద్యం ఆఖరికి గ్రూప్ 1 పరీక్షలు కాదేది అవినీతికి అనర్హం.
గ్రూప్ 1 పరీక్షలు రాసిన అభ్యర్థుల జీవితాలను నాశనం చేస్తున్నాడు

 ఏపీపీఎస్సీ ని వైసిపి పీఎస్సీ గా మార్చాలని ప్రయత్నం చేస్తున్నారు.
 జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత ఏపీపీఎస్సీ ద్వారా నిర్వహించిన గ్రామ సచివాలయ పరీక్షల పేపర్ లీకేజ్,ఉద్యోగాలు అమ్ముకోవడం చూసాం.
 రాజ్యాంగబద్దమైన వ్యవస్థ ఏపీపీఎస్సీ.చంద్రబాబు గారి హయాంలో రాజీకీయాలకు సంబంధం లేని వారిని ఏపీపీఎస్సీ లో నియమించారు.
 ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్ ని ఏపీపీఎస్సీ ఛైర్మెన్ గా నియమించిన ఘనత చంద్రబాబు గారిది.
 కానీ జగన్మోహన్ రెడ్డి ఏపీపీఎస్సీ ని బ్రష్టు పట్టిస్తున్నాడు.కనీస విద్యార్హత లేని వారు,రాజకీయలకు సంబంధం ఉన్నవారు,ప్రతిపక్ష నాయకుల పై అక్రమ కేసులు పెడుతున్న అధికారుల బంధువుల ని ఏపీపీఎస్సీ లో నియమిస్తున్నారు.
 రాజ్యాంగబద్దమైన పదవిలో ఉన్న ఏపీపీఎస్సీ ఛైర్మెన్ ఆఫీస్ కి తాళం వేసిన ఇది మూర్ఖపు ప్రభుత్వం
ఇప్పుడున్న ఛైర్మెన్
అక్రమాలు చెయ్యడానికి, ఉద్యోగాల అమ్మకానికి అడ్డొస్తారు అనే జాబ్స్ క్యాలెండర్ విడుదల చెయ్యడం లేదు.
 లక్షలమంది యువత పోటీ పడే గ్రూప్-1 పరీక్షల్లో విజయం సాధించడానికి కష్టం ఏమిటో అందరికీ తెలుసు
 ప్రిలిమ్స్,మెయిన్స్,ఇంటర్వ్యూ కోసం అభ్యర్థులు ఎంతో శ్రద్దగా చదువుకుంటారు.
 గ్రూప్-1 ఉద్యోగం సాధించడమే లక్ష్యంగా వచ్చిన ఇతర ఉద్యోగాలని సైతం వద్దనుకునేవారు ఉంటారు.
 ఒక్క తెలుగుదేశం పార్టీ హయాంలో మాత్రమే సక్రమంగా పరీక్షలు నిర్వహించి,అర్హులకు ఉద్యోగాలు కల్పించాం.
 నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు గైడ్ లైన్స్ ని మాత్రమే ఫాలో అవ్వాలి.అలాంటిది ఎలాంటి నిబంధనలు పాటించకుండా ఇష్టం వచ్చినట్టు అక్రమాలకు పాల్పడ్డారు.
 2018లో జారీ అయిన గ్రూప్ వన్ నోటిఫికేషన్ కు మెయిన్స్ రాత పరీక్ష గత ఏడాది డిసెంబర్ లో జరిగింది.
 ఈ ఏడాది ఏప్రిల్ 28న ఫలితాలు ప్రకటించారు.
 దాదాపు 9678 మంది అభ్యర్థుల్లో ఇంటర్వ్యూ రౌండ్‌కు స్పోర్ట్స్ కోటా తో కలిపి 340 మంది ఎంపికయ్యారు.
 ఈ పరీక్ష ద్వారా ఎంపికైన అభ్యర్థులు సబ్ కలెక్టర్లుగా, ఆర్డీవోలుగా, ఉన్న‌తాధికారులుగాను సేవలందిస్తారు. కాబట్టి, పరీక్షా విధానo పారదర్శకంగా, న్యాయంగా, లోపాలు, పక్షపాతం లేకుండా ఉండటం చాలా ముఖ్యం.
 పరీక్షలకు సంబంధించిన వేల్యూష‌న్‌ సక్రమంగా జరగలేదనే ఫిర్యాదులు అనేకం వచ్చాయి. ఎంపిక విధానం గతంలో జరిగిన ప్రక్రియకు విరుద్ధంగా ఉంది.
 ఎలాంటి అధ్యయనం లేకుండా డిజిటల్ వేల్యూష‌న్‌ని ఎంచుకోవటం అనేక విమర్శలకు తావిస్తోంది.
 మాన్యువల్ వేల్యూష‌న్ చేయ‌డం కోసం రూపొందించిన జవాబు పత్రాలను డిజిటల్ పద్దతిలో చేయటం వల్ల అర్హులైన వారు నష్టపోతున్నారు.
 గైడ్ లైన్స్ లో మాన్యువల్ వేల్యూష‌న్ అని ఉంటే మధ్యలో డిజిటల్ వేల్యూష‌న్ కి ఎందుకు వెళ్లారు?వేల్యూష‌న్ ఎక్కడ జరిగింది?అసలు ఆ విధానం ఫాలో అయ్యారు?
 అక్రమాలు జరిగిన మాట వాస్తవం.కానీ ప్రభుత్వం దున్నపోతు మీద వర్షం పడినట్టు వ్యవహరిస్తోంది.
 మీరు అడుగుతున్నవి న్యాయమైన డిమాండ్స్.రాష్ట్ర ప్రభుత్వం దిగి రావాలి.తక్షణమే చర్యలు తీసుకోవాలి
 మెయిన్స్ జవాబు ప‌త్రాల‌ను మాన్యువ‌ల్ వేల్యూష‌న్‌ చేయాలి.
 ఎంపిక చేసిన అభ్యర్థుల పేర్లు, అంద‌రి అభ్యర్థుల మార్కులను వెల్లడించాలి. ఇది వారి తదుపరి ప్రయత్నం కోసం, లోపాలు సరిచేసుకునేందుకు ఉపయోగపడుతుంది.
 డిజిటల్ వేల్యూష‌న్‌కి సంబంధించిన సాంకేతికత SOP పై శ్వేతపత్రాన్ని విడుదల చేయండి.
 ఎంపిక చేయని అభ్యర్థులందరి మార్కులు, వారి జ‌వాబు ప‌త్రాల‌ను విడుదల చేయాలి
 ఎంపిక ప్రక్రియ, వేల్యూష‌న్‌పై అనుమానాలున్న‌వారి ఫిర్యాదులు స్వీక‌రించేందుకు ఆన్‌లైన్ ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను ఏర్పాటు చేయాలి.
 ఇప్పటికైనా అభ్యర్థుల జీవితాలతో ఆటలాడటం మాని గ్రూప్ 1 లో అవకతవకలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోని అభ్యర్థులకు న్యాయం చెయ్యాలి. ఏపీపీఎస్సీ లో జరిగిన అక్రమాలపై జ్యుడీషియల్ ఎంక్వయిరీ జరిపించాలి
 మీకు న్యాయం జరిగే వరకూ తెలుగు యువత అండగా ఉంటుందని అవసరమైతే అభ్యర్థుల తరపున ఎంత వరకు పోరాటం చేయడానికైనా తెలుగు యువత సిద్ధంగా ఉందని యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాగల ఆనంద్ గౌడ్ తెలియజేశారు