UP | భార్య‌కు.. ప్రియుడితో పెళ్లి చేసిన భ‌ర్త‌! తిప్పి పంపిన అత్త‌

  • By: sr    news    Apr 02, 2025 2:11 PM IST
UP | భార్య‌కు.. ప్రియుడితో పెళ్లి చేసిన భ‌ర్త‌! తిప్పి పంపిన అత్త‌

UP |

విధాత: ప్రియుడే కావాలన్న భార్య మాటను కాదనలేక వారిద్దరికి పెళ్లి చేసిన ఓ భర్త త్యాగాన్ని విధి గెలిపించింది. ఉత్తర ప్రదేశ్ లోని సంత్ కబీర్ నగర్ జిల్లా కటార్ జాట్ గ్రామంలో భర్త బబ్లూ తన భార్య రాధికను ఆమె ప్రియుడు వికాస్ కు ఇచ్చి స్వయంగా పెళ్లి జిరిపించిన సంగతి తెలిసిందే. ఈ ఘటన దేశ వ్యాప్తంగా వైరల్ గా మారింది. ఇప్పుడు ఈ ప్రేమకథ వ్యవహారంలో కీలక మలుపు చోటుచేసుకుంది. రాధిక రెండో భర్త వికాస్ తల్లి రాధికను తిరిగి తన మొదటి భర్త బబ్లూ వద్దకే అమెను పంపించి షాక్ ఇచ్చింది. రాధిక భర్త బబ్లూ, అతడి ఇద్దరు పిల్లల మానసిక క్షోభ గురించి ఆలోచించి చలించిపోయానని.. అందుకే రాధికను మళ్లీ మొదటి భర్త వద్దకే వెళ్లిపోమ్మని తేల్చి చెప్పానని వికాస్ తల్లి వెల్లడించింది.

భార్యకు దూరమై పిల్లలిద్ధరిని చూసుకుంటూ బబ్లూ అనుభవించే బాధను వికాస్ తల్లి కొడుక్కి అర్ధమయ్యేలా చెప్పింది. దీంతో వికాస్ తిరిగి రాధికను మొదటి భర్త బబ్లూ వద్ధకు పంపించేశాడు. అనూహ్య మలుపులతో ఒక భార్య ఇద్దరు భర్తల పంచాయతీ కాస్తా మళ్లి కటార్ జాట్ గ్రామ పెద్ధల వద్ధకు చేరింది. తిరిగొచ్చిన తన భార్య రాధికను తాను స్వీకరించి బాగా చూసుకుంటానని మొదటి భర్త బబ్లూ గ్రామపెద్ధలకు హామీ ఇచ్చాడు. వారందరి ముందు బబ్లూ ప్రమాణం చేసి రాధికను తిరిగి స్వీకరించాడు. దీంతో భార్య కోసం బబ్లూ తొలుత ప్రియుడికిచ్చి పెళ్లి చేసి ఒక త్యాగం..తిరిగొచ్చాక స్వీకరించి రెండో త్యాగం చేశాడని నెటిజన్లు కొనియాడుతున్నారు.

ఈ వివాదం పూర్వపరాల్లోకి వెళితే బబ్లూ, రాధిక దంపతులకు ఇద్దరు పిల్లలున్నారు. ఉద్యోగ రిత్యా ఎక్కువ కాలం కుటుంబంతో గడపలేని పరిస్థితుల మధ్య బబ్లూ భార్య రాధిక స్థానిక యువకుడు వికాస్ తో అక్రమ సంబంధం పెట్టుకుంది. విషయం తెలుసుకున్న బబ్లూ ఆమె నచ్చచెప్పే ప్రయత్నం చేశాడు. అయితే తనకు ప్రియుడు వికాస్ కావాలంటూ భార్య మొండిపట్టు పట్టింది. చేసేది లేక బబ్లూ తన భార్యను త్యాగం చేసి ఆమె ప్రియుడికి ఇచ్చి పెళ్లి జరిపించాడు. తన ఇద్దరు పిల్లల పోషణ బాధ్యతలను తనే చూసుకుంటున్నాడు. అయితే రాధిక రెండో భర్త వికాస్ తల్లి తీసుకున్న నిర్ణయంతో మళ్లీ రాధిక తన మొదటి భర్త, పిల్లల వద్దకు చేరుకోవడంతో వారి ప్రేమ, పెళ్లి వివాదాలకు చివరకు శుభం కార్డు పడినట్లయ్యింది.