Viral: తండ్రి మృతదేహం ఎదుట ప్రియురాలిలో పెళ్లి!
విధాత: తండ్రి మృతదేహం ఎదుట ఓ యువకుడు తన ప్రియురాలిని పెళ్లి చేసుకున్న ఘటన వైరల్ గా మారింది. తమిళనాడులోని కడలూరు జిల్లా కవణ్ణెలో ఈ ఘటన చోటుచేసుకుంది. కవణై గ్రామానికి చెందిన సెల్వరాజ్ రైల్వే శాఖలో పని చేసి రిటైరయ్యారు. ఆయన రెండవ కుమారుడు అప్పు విరుధాచలం కౌంజియప్పర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్‌లో మూడో సంవత్సరం చదువుతున్న క్రమంలో విజయశాంతితో ప్రేమలో పడ్డాడు. కెరీర్‌లో సెటిల్ అయ్యాక ఇరు కుటుంబాల సమ్మతితో వారు పెళ్లి చేసుకోవాలనున్నారు.
అయితే అప్పు తండ్రి సెల్వరాజ్ అనారోగ్యంతో బుధవారం రాత్రి కన్నుమూశారు. తండ్రి భౌతిక రూపం కనుమరుగు అయ్యే ముందే ఆయన ఆశీస్సులు పొందాలనే ఉద్దేశంతో ప్రేయసి విజయశాంతిని ఒప్పించి తండ్రి మృతదేహం ఎదుట ఆమెకు అప్పు తాళి కట్టారు. తీవ్ర దుఃఖంలోను అప్పు తల్లి, బంధువులు, గ్రామస్థులు వారిని చల్లగా ఉండాలని దీవించారు.
కాగా అమ్మాయి తరుఫు నుంచి ఎవరూ ఈ కార్యక్రమానికి హాజరుకాలేదు. తండ్రి ఆశీస్సులు పొందాలనే ఉద్దేశంతో అంతిమయాత్రకు ముందే ఇలా పెళ్లి చేసుకున్నట్లు అప్పు వెల్లడించారు. అయితే ప్రియుడి పరిస్థితిని అర్థం చేసుకుని.. అతని మనస్సు గ్రహించి ఆ సమయంలో పెళ్లికి అంగీకరించిన విజయశాంతిది గొప్ప మనసు అని అందరూ కొనియాడుతున్నారు.
తండ్రి శవం ముందు పెళ్లి చేసుకున్న కుమారుడు.
ఈ ఘటన తమిళనాడులోని కడలూర్ జిల్లాలో చోటుచేసుకుంది.
తండ్రి అంతిమయాత్రకు ముందే ఆయన ఆశీస్సులు పొందాలనే ఉద్దేశంతో, ప్రియురాలిని ఒప్పించి తండ్రి మృతదేహం ముందు ఆమెకు తాళి కట్టాడు.#Tamilnadu pic.twitter.com/cO9YSyEnA9
— greatandhra (@greatandhranews) April 19, 2025
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram