Aamir Khan: టాలీవుడ్ ద‌ర్శ‌కుడితో అమీర్‌ఖాన్‌

  • By: sr    news    Jan 02, 2025 9:56 PM IST
Aamir Khan: టాలీవుడ్ ద‌ర్శ‌కుడితో అమీర్‌ఖాన్‌

Aamir Khan  and Vamshi Paidipally

ప్ర‌స్తుతం బాలీవుడ్ బ‌డా హీరోల క‌న్ను సౌత్ ద‌ర్శ‌కులపై ప‌డింది. ఇప్ప‌టికే అట్లీ, సందీప్ రెడ్డి వంగా, గోపీచంద్ మ‌లినేని, చ‌ర‌ణ్‌తేజ్ ఉప్ప‌ల‌పాటి వంటి ద‌ర్శ‌కులు హిందీ చిత్రాల రూప‌క‌ల్ప‌న‌లో బిజీగా ఉండ‌గా ఇప్ప‌డు వారి జాబితాలో మ‌రో తెలుగు ద‌ర్శ‌కుడు వంశీ పైడిప‌ల్లి చేర‌నున్న‌ట్లు స‌మాచారం.

తెలుగులో బృందావ‌నం, మ‌హ‌ర్షి, ఊపిరి, వార‌సుడు వంటి చిత్రాల‌తో ఆగ్ర ద‌ర్శ‌కుడిగా పేరు తెచ్చుకున్న వంశీ (Vamshi Paidipally) ఈసారి అమీర్‌ఖాన్‌(Aamir Khan)తో ఓ మూవీకి రెడీ అయిన‌ట్లు తెలుస్తోంది.

ఇటీవ‌ల సాలిడ్ సబ్జెక్టు, స్క్రిప్ట్ కుద‌ర‌డంతో వంశీ పైడిపల్లి ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఇద్ద‌రు క‌లిసి అమీర్ ఖాన్‌ను సంప్ర‌దించార‌ని, క‌థ బాగా న‌చ్చ‌డంతో అమీర్ ఖాన్‌కు ఈ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు టాక్ నడుస్తోంది. త్వరలోనే ఈ క్రేజీ కాంబోలో రానున్న ప్రాజెక్ట్ పై అఫీషియల్ అనౌన్స్మెంట్ రాబోతోందని అంటున్నారు.