Sonu Sood | కుమారి ఆంటీ స్టాల్‌ను సందర్శించిన నటుడు సోను సూద్‌

సినీ నటుడు సోనుసూద్ శుక్రవారం కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్‌ను సందర్శించారు. మహిళలు స్వయం ఉపాధితో జీవితంలో ఎదిగేందుకు కుమారీ ఆంటీ స్ఫూర్తిదాయకమని ఈ సందర్భంగా సోనుసూద్ కొనియాడారు

  • By: Somu |    news |    Published on : Jul 05, 2024 12:35 PM IST
Sonu Sood | కుమారి ఆంటీ స్టాల్‌ను సందర్శించిన నటుడు సోను సూద్‌

మహిళాభివృద్ధికి స్ఫూర్తి దాయమని ప్రశంసలు

విధాత, హైదరాబాద్ : సినీ నటుడు సోనుసూద్ శుక్రవారం కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్‌ను సందర్శించారు. మహిళలు స్వయం ఉపాధితో జీవితంలో ఎదిగేందుకు కుమారీ ఆంటీ స్ఫూర్తిదాయకమని ఈ సందర్భంగా సోనుసూద్ కొనియాడారు. తనకోసం కుమారి ఆంటీ తెచ్చిన శాలువ, బొకేతో ఆమెనే సన్మానించారు. ఫుడ్ స్టాల్ ఎలా నడుస్తుందంటూ అడిగిన సోనుసూద్‌ తాను వెజిటెరియన్ అని ఫ్లేటు ఎంత రేటు అని అడిగారు.

వెజ్‌, నాన్ వెజ్ రెండు వంటకాలు ఉన్నాయని, వెజ్ 80, నాన్‌వెజ్ 120రూపాయలకు అందిస్తున్నామని, మీకు ఉచితంగా ఇస్తామని కుమారి ఆంటీ తనకు అంతంతమాత్రంగా వచ్చే హిందీలో బదులిచ్చారు. కష్టాల్లో ఉన్న వారిని ఆదుకునే మీ వంటి వారికోసం ఎంత చేసినా తక్కువేనన్నారు. ఆమె మాటలను, పనితీరును అభినందించిన సోనుసూద్ ఆమె జీవితంలో మరింత ఉన్నత స్థానానికి చేరుకోవాలంటూ ఆకాంక్షించారు. ఈ సందర్భంగా కుమారి ఆంటీ తన కూతురును, కొడుకును సోనుసూద్‌కు పరిచయం చేశారు. అనంతరం సోనుసూద్‌ అక్కడే భోజనం చేసి, అక్కడికి వచ్చిన అభిమానులతో సెల్ఫీలు దిగి వెళ్లిపోయారు.