Samantha: ‘సెకండ్ హ్యాండ్’ అన్నారు

Samantha
విధాత: ఇటీవలే నా ఎక్స్‌కు ఇచ్చిన ఖరీదైన బహుమతులు వృథా అయ్యాయి అంటూ సెటైరికల్‌గా మాట్లాడిన సమంత (Samantha) తాజాగా తనపై జరిగిన ట్రోలింగ్‌పై రియాక్ట్ అయింది. ఒక మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన బాధలన్నింటిని బయట పెట్టి భావోద్వేగానికి గురైంది.
ఈ సందర్భంగా సమంత మాట్లాడుతూ.. ‘జీవితంలో ఎవరైనా సరే విడాకులు తీసుకుంటే, దానిని ప్రజలు ఫెయిల్యూర్‌గానే భావిస్తారు. అలాంటి పరిస్థితులు ఎదుర్కోవడం ఎంత కష్టంగా ఉంటుందో.. అనుభవించిన వారికే తెలుస్తుంది.
పెళ్లైన నాలుగేళ్లకే చైతన్యతో నేను విడాకులు తీసుకున్నాను. ఆ తర్వాత ఎన్నో తీవ్రమైన ట్రోలింగ్స్ ఎదుర్కొన్నా. నాపై రూమర్స్ కూడా వచ్చాయి. కొంతమంది ‘సెకండ్ హ్యాండ్’ అని, యూజ్డ్, వేస్ట్ అని కూడా కామెంట్లు చేశారు.
నాపై, నా క్యారెక్టర్ పై లేనిపోని అవాస్తవాలెన్నో వ్యాప్తి చేశారు. అయితే అవన్నీ నిజం కాదని ఎన్నోసార్లు బయటకు వచ్చి చెప్పాలని అనిపించింది. కానీ వాటి వల్ల ఏం ప్రయోజనం ఉండదని ఆగిపోయాను’.
వాటన్నింటినీ దిగమింగుకొని, నన్ను నేను మళ్లీ కొత్తగా జీవించాలనుకుని అన్ని నిందలు మోసాను, అలా నాడు అడుగు ధైర్యంగా ముందుకు వేయడం వల్లే ఇప్పుడు నా కెరియర్ లో నేను చాలా సంతోషంగా ఉన్నా అంటూ ధీమా వ్యక్తం చేసింది.