Gold Rates: ఐదు రోజుల తర్వాత.. స్వల్పంగా పెరిగిన పసిడి!

విధాత: బంగారం ధరలు మరోసారి పెరిగాయి. వరుసగా ఐదు రోజులు తగ్గుదల నమోదు చేసిన బంగారం ధరలు ఆరవ రోజు బుధవారం తిరిగి హెచ్చుదల వైపు సాగాయి. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం రూ.650పెరిగి రూ.82,900కు పెరిగింది. 24క్యారెట్ల 10గ్రాములకు రూ.710పెరిగి రూ.90,440కి చేరింది. హైదరాబాద్, బెంగుళూరు, చైన్నైలలో అవే ధరలు కొనసాగాయి. న్యూఢిల్లీలో 22క్యారెట్లకు రూ.83,050, 24క్యారెట్లకు రూ.90,590గా ఉంది. దుబాయ్ లో 22క్యారెట్లకు రూ.78,855, 24క్యారెట్లకు రూ.84,808గా ఉండగా, అమెరికాలో 22క్యారెట్లకు రూ.78,370గా, 24క్యారెట్లకు రూ. 83,349గా ఉంది.
ALSO READ : Indore ‘Jab We Met’ | ప్రేమికుడి కోసం పారిపోయిన యువతి..వేరేవాణ్ని పెళ్లిచేసుకుని వచ్చింది.!
స్వల్పంగా తగ్గిన వెండి ధరలు
వెండి ధరలు మరోసారి తగ్గుముఖం పట్టాయి. కిలో వెండిపై రూ.1000తగ్గింది. కిలో వెండి ధర రూ. 1,02,000గా ఉంది. వరుసగా ఏడు రోజులు వెండి ధరల తగ్గుదలను నమోదు చేయడం గమనార్హం.