Ap government: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ట్రాఫిక్ సమస్యలకు ఇక చెక్
Ap government: ట్రాఫిక్ సమస్యలను నివారించేందుకు ఏపీ ప్రభుత్వం అస్త్రం పేరిట ఓ యాప్ తీసుకొచ్చింది. విశాఖ పట్నంలో ఈ యాప్ ను ప్రయోగాత్మకంగా అమలు చేయబోతున్నారు. విశాఖ పట్నంలో ప్రస్తుతం రద్దీ విపరీతంగా ఉంటున్నది. ఈ నేపథ్యంలో వాహనదారులను ఈ యాప్ ద్వారా అలర్ట్ చేస్తున్నారు.
ఏయే ప్రాంతాల్లో రద్దీ ఎక్కువగా ఉందో తెలుసుకొని.. ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని మంత్రి అనిత సూచించారు. ప్రజలకు రియల్ టైమ్ ట్రాఫిక్ సమాచారం అందించడమే ఈ యాప్ ఉద్దేశమని ఆమె తెలిపారు. ఈ యాప్ ను డౌన్‌లోడ్ చేసుకున్న వినియోగదారులు విశాఖలో ట్రాఫిక్ ఎక్కువగా ఉండే ప్రాంతాలను ముందుగానే తెలుసుకొని ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా గమ్యస్థానానికి త్వరగా చేరుకోవచ్చన్నారు.
అలాగే, తమ పరిసరాల్లో యాక్సిడెంట్లు జరిగినా, ట్రాఫిక్ జామ్‌లు ఉన్నా, వాటిని యాప్ ద్వారా ఇతరులకు తెలియజేయవచ్చన్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram