పాకిస్తాన్‌కు.. బలుచిస్తాన్ షాక్ !

  • By: sr    news    May 10, 2025 6:34 PM IST
పాకిస్తాన్‌కు.. బలుచిస్తాన్ షాక్ !

విధాత, న్యూఢిల్లీ : భారత్ చేపట్టిన ఆపరేషన్‌ సిందూర్‌తో బెంబేలెత్తుతున్న పాకిస్తాన్‌కు మరో షాక్ తగిలింది. కలాట్ జిల్లాలోని మంగోచార్ నగరాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నట్లు బలూచ్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) శనివారం అధికారికంగా ప్రకటించింది. భారత్‌తో సరిహద్దు ఉద్రిక్తతలను అవకాశంగా తీసుకున్న బలూచిస్థాన్‌ వేర్పాటు వాదులు పాక్‌పై తిరుగుబాటు ఉదృతం చేస్తున్నారు. ఒక్కో నగరాన్ని ఆక్రమిస్తూ పాక్ లోకి దూసుకెలుతున్నారు.

పాక్ ఆర్మీపై 39 చోట్ల మెరుపుదాడులు చేసిన బలూచ్ లిబరేషన్ ఆర్మీ క్వెట్టాతో పాటు మంగోచార్ నగరాన్ని ఆక్రమించేశారు. గత రెండు రోజులుగా బలోచ్ రెబల్స్ పాక్ సైన్యంపై వరుస దాడులు చేస్తున్నారు. అటు అఫ్ఘనిస్తాన్ కూడా పాక్ కు పక్కంలో బల్లెంలా తయారైంది. ఈ నేపథ్యంలో సరిహద్దుల వెంట భారత్ తో యుద్దానికి కాలుదువ్వుతూ పాకిస్తాన్ చేస్తున్న దుస్సాహసం వికటించే పరిస్థితులు ఉన్నాయని సైనిక రంగం నిపుణులు విశ్లేషిస్తున్నారు.