విధాత: బిగ్ బాస్ విన్నర్ సిద్ధార్ధ్ శుక్లా గుండె పోటు తో కనుమూశారు. 40 ఏళ్లకే మంచి నటుడు వెళ్ళిపోయాడు.ముంబై కూపర్ ఆసుపత్రి వైద్యులు ప్రాధమికంగా హార్ట్ ఎటాక్ తో చనిపోయినట్లు తెలిపారు. పోస్టుమార్టం అనంతరం వాస్తవాలు వెలుగులోకి రావచ్చు. ఎయిడ్స్ ఫస్ట్ స్టేజి లో ఉందని మందులు వాడుతున్నాడనేది ముంబై జర్నలిస్ట్ ల సమాచారం. రాత్రి టాబ్లెట్స్ వేసుకుని పడుకున్నారని నిద్రలోనే చనిపోయినట్లు తెలిసింది. ఉదయం పదిన్నర అయినా లేవకపోవడంతో చెల్లెలు లేపే ప్రయత్నం చేయడం, అప్పటికే ఒళ్ళు చల్లబడి ఉండటం గమనించి కూపర్ ఆసుపత్రికి తరలించగా, నిద్ర లోనే చనిపోయినట్లు వైద్యులు చెప్పారట.
సిద్ధార్ధ్ చిన్న వయసులోనే అద్భుత కెరియర్ వున్నప్పుడే వెళ్లిపోవడం విషాదకర ముగింపు 21 ఏళ్ళ క్రితం టివి సీరియల్ నటుడిగా పరిచయం అయ్యాడు. ఇండస్ట్రీకి బాలికా వధు సీరియల్ తో మంచి బ్రేక్ వచ్చింది, విచిత్రమో విధి వింత నాటకమో ఏమో …ఆ సీరియల్ లో హీరోయిన్ గా నటించిన ఆనంది కూడా చిన్న వయసులోనే చనిపోయింది. ఇప్పుడు సిద్ధార్ధ్ శుక్లా కూడా వెళ్ళిపోయాడు.
ముంబై కి చెందిన సిద్ధార్ధ్ శుక్లా పట్టిందల్లా బంగారమే, డిగ్రీ పూర్తి చేసి ఇంటీరియర్ డిజైనింగ్ కోర్స్ చేసి కొంతకాలం డిజైనర్ గా రాణించి టివి ఇండస్ట్రీ లోకి అనుకోకుండా వచ్చిన అవకాశం తో అడుగుపెట్టాడు. చదువుకునే రోజుల్లోనే మంచి మోడల్ గా గుర్తింపు పొందాడు, టర్కీ లో జరిగిన వరల్డ్ బెస్ట్ మోడల్ పోటీలో పాల్గొనే అవకాశం లభించిన తొలి ఇండియన్ మోడల్ సిద్ధార్ధ్.
ఝలక్ దిఖ్లాజ, హంటి కీ శర్మ లాంటి కొన్ని సినిమాల్లోనూ సత్తా చాటుకున్నాడు ఫియర్ ఫ్యాక్టర్ లాంటి రియాలిటీ షో లో పాల్గొన్నాడు, హోస్ట్ గా వ్యవహరించాడు బిగ్ బాస్ తో పిచ్చ క్రేజ్ సంపాదించుకున్నాడు, అమ్మాయిల అందాల అభిమాన నటుడిగా గొప్ప ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు.
కొన్ని అలవాట్లు కొందరి జీవితాలను తలకిందులు చేసేస్తాయి ఏదీ మితి మీరకూడదు మనని మించి పోకూడదు. సిద్ధార్ధ్ తండ్రి కూడా వీర తాగుబోతు, లివర్ దెబ్బతిని చనిపోయాడు సిద్ధార్ధ్ కూడా తండ్రిని మించిన డ్రింకర్. గర్ల్ ఫ్రెండ్స్ డేటింగ్ ఫ్రెండ్స్ కూడా ఎక్కువే శృతి మించిన సోగ్గాడే పలుమార్లు ప్రేమలో పడ్డాడు ప్రేమించడం బ్రేక్ అప్ లు చెప్పడం కూడా షరా మామూలే. విపరీతమైన స్ట్రెస్ కు లోను అవుతాడట, చెప్పుకోలేని వ్యాధి కి మందులు వాడుతున్నాడట, దిగులు, ఒత్తిడి, డ్రింక్…మొత్తానికి 40 కే “ఇక సెలవు” అంటూ వెళ్ళిపోయాడు.