ఏపీ రాజ్యసభ స్థానం ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదల

  • By: sr    news    Apr 16, 2025 4:56 PM IST
ఏపీ రాజ్యసభ స్థానం ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదల

విధాత: వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజీనామాతో ఖాళీయైన ఏపీ రాజ్యసభ స్థానానికి కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నెల 22న నోటిఫికేషన్ జారీ కానుంది. 29 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 30న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. మే 2 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఇచ్చారు.

మే 9న ఉదయం 9 నుంచి సాయంత్రం 4గంటల వరకు పోలింగ్ ఉంటుంది. అదేరోజు సాయంత్రం 5 గంటల నుంచి ఓట్లు లెక్కిస్తారు. 13వ తేదీలోపు ఈఎన్నికల ప్రక్రియ పూర్తికానుంది. ప్రస్తుతం కూటమి ఎమ్మెల్యేలు మెజార్టీగా ఉన్న నేపథ్యంలో ఈ స్థానం టీడీపీ కూటమి సొంతం చేసుకోనుంది.