కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి : చైర్మన్ బనుక శివరాజ్
ప్రభుత్వం రైతుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను మండల రైతులు వినియోగించుకోవాలని జనగామ మార్కెట్ కమిటీ చైర్మన్ బనుక శివరాజ్ యాదవ్ అన్నారు. మంగళవారం జనగామ మండలంలోని పెంబర్తి గ్రామంలో పీఏసీఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని స్థానిక పీఏసీఎస్ చైర్మన్ నిమ్మతి మహేందర్ రెడ్డి తో కలిసి ఆయన ప్రారంభించారు.

- కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి
- జనగామ మార్కెట్ కమిటీ చైర్మన్ బనుక శివరాజ్
జనగామ అక్టోబర్ 14 (విధాత): ప్రభుత్వం రైతుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను మండల రైతులు వినియోగించుకోవాలని జనగామ మార్కెట్ కమిటీ చైర్మన్ బనుక శివరాజ్ యాదవ్ అన్నారు. మంగళవారం జనగామ మండలంలోని పెంబర్తి గ్రామంలో పీఏసీఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని స్థానిక పీఏసీఎస్ చైర్మన్ నిమ్మతి మహేందర్ రెడ్డి తో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా శివరాజ్ మాట్లాడుతూ రైతుల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని, పండించిన ప్రతీ గింజను కొనుగోలు చేస్తామన్నారు.
దళారులను నమ్మి మోసపోవద్దు
రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో మాత్రమే విక్రయించుకొని మద్దతు ధర పొందాలని ప్యాక్స్ చైర్మన్ మహేందర్ రెడ్డి అన్నారు. పీఏసీఎస్ సెంటర్ వద్ద రైతుల అవసరార్థం సీనియర్ నాయకుడు డా.సి.హెచ్ రాజమౌళి తన వంతు సహాయంగా రూ.పది వేలు ఆర్ధిక సహాయం అందిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు డా.రాజమౌళి, గోదల వంశీధర్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు లింగాల నర్సిరెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షుడు బండ్రు సిద్దులు, అంబాల శంకర్ గౌడ్, గొలుసుల దుర్గాచలం, పార్టీ యూత్ అధ్యక్షుడు భాను, ప్యాక్స్ డైరెక్టర్స్ భంగిమఠం నాగభూషణం, డీసీఓ కోదండరాం, సీఈఓ రామ్మోహన్, ఏఈఓ రిషిత, హమలీలు, రైతులు పాల్గొన్నారు.