Conjoined twins | ప్రపంచంలోనే అత్యంత వృద్ధులైన అవిభక్త కవలలు కన్నుమూత.. వారి వయస్సు ఎంతంటే..!

Conjoined twins | లోరీ, జార్జి..! ఈ ఇద్దరూ 1961లో అవిభక్త కవలలుగా జన్మించారు. నాటి వైద్యుల అంచనాలను తలకిందులు చేస్తూ ఏకంగా 62 ఏండ్లు బతికారు. ప్రపంచంలోనే అత్యంత వృద్ధులైన అవిభక్త కవలలుగా గిన్నిస్‌ పుస్తకంలో చోటు సంపాదించుకున్నారు. ఇటీవల ఆ ఇద్దరూ కన్నుమూశారు. లోరి, జార్జిలు ఏప్రిల్‌ 7న మరణించగా.. ఈ విషయం వారం రోజులు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

  • By: Thyagi |    news |    Published on : Apr 14, 2024 10:50 AM IST
Conjoined twins | ప్రపంచంలోనే అత్యంత వృద్ధులైన అవిభక్త కవలలు కన్నుమూత.. వారి వయస్సు ఎంతంటే..!

Conjoined twins : లోరీ, జార్జి..! ఈ ఇద్దరూ 1961లో అవిభక్త కవలలుగా జన్మించారు. నాటి వైద్యుల అంచనాలను తలకిందులు చేస్తూ ఏకంగా 62 ఏండ్లు బతికారు. ప్రపంచంలోనే అత్యంత వృద్ధులైన అవిభక్త కవలలుగా గిన్నిస్‌ పుస్తకంలో చోటు సంపాదించుకున్నారు. ఇటీవల ఆ ఇద్దరూ కన్నుమూశారు. లోరి, జార్జిలు ఏప్రిల్‌ 7న మరణించగా.. ఈ విషయం వారం రోజులు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

అయితే వారి మరణానికి కారణం తెలియరాలేదు. లోరీ, జార్జిలు 1961 సెప్టెంబర్‌ 18న పెన్సిల్వేనియాలోని వెస్ట్‌ రీడింగ్‌లో వేర్వేరు మెదళ్లతో, అతుక్కున్న పుర్రెతో జన్మించారు. లోరి కంటే జార్జ్‌ ఎత్తు నాలుగు అంగుళాలు తక్కువగా ఉండేది. ప్రత్యేకంగా తయారు చేసిన చక్రాల కుర్చీతో ఆయన ఎప్పుడూ లోరి చుట్టూనే ఉండేవారు. ఒకరు ఎక్కడకు వెళ్లినా మరొకరు తప్పకుండా వెళ్లాల్సిన పరిస్థితి ఉన్నప్పటికీ.. ఇద్దరూ సాధ్యమైనంత మేర స్వతంత్రంగా జీవించారు.

తాము పుట్టినప్పుడు కనీసం 30 ఏళ్లు కూడా బతకలేమని వైద్యులు భావించారని, కానీ తాము అది తప్పని నిరూపించామని వారు 50వ పడిలో ప్రవేశించిన సమయంలో ఇచ్చిన ఇంటర్వ్యూలో లోరీ చెప్పారు. కాగా, జార్జ్‌ 2007లో తాను ట్రాన్స్‌జెండర్‌ను అని ప్రకటించారు. ఇక గతంలో లోరీకి ఓ వ్యక్తితో నిశ్చితార్థం జరిగింది. కానీ అతను వాహన ప్రమాదంలో మరణించారు.

అదేవిధంగా తాను డేట్‌కు వెళ్లిన సమయంలో చదువుకునేందుకు జార్జి వెంట పుస్తకాలు ఉండేవని గతంలో లోరీ తెలిపింది. కాగా, ఈ ఇద్దరు తోబుట్టువులు పబ్లిక్‌ హైస్కూల్‌ నుంచి గ్రాడ్యుయేషన్‌ చేశారు. గతంలో లోరీ ఆరేళ్లపాటు ఆస్పత్రి లాండ్రీలో ఉద్యోగం చేయగా జార్జ్‌ కూడా ఆమె ఉండాల్సి వచ్చింది. ఆరేళ్ల తర్వాత 1996లో లోరీ ఉద్యోగానికి రాజీనామా చేశారు.