దారుణం.. కళ్లముందే ప్రాణం పోతున్నా పట్టించుకోని జనం
గుంటూరు జిల్లా కూరగల్లులో జరిగిన రోడ్డు ప్రమాదం చూపరులను కలిచివేసింది. మానవత్వం మంటగలి పోయిందని చెప్పడానికి నిలువెత్తు నిదర్శనంగా మారింది. టిప్పర్ లారీని ఓవర్ టేక్ చేస్తూ ప్రమాదవశాత్తు కిందపడిపోయిన బైకర్ తలపై నుంచి టిప్పర్ లారీ వెళ్లిపోయింది
విధాత: గుంటూరు జిల్లా కూరగల్లులో జరిగిన రోడ్డు ప్రమాదం చూపరులను కలిచివేసింది. మానవత్వం మంటగలి పోయిందని చెప్పడానికి నిలువెత్తు నిదర్శనంగా మారింది. టిప్పర్ లారీని ఓవర్ టేక్ చేస్తూ ప్రమాదవశాత్తు కిందపడిపోయిన బైకర్ తలపై నుంచి టిప్పర్ లారీ వెళ్లిపోయింది. ఈ ఘటనలో బైకర్ తలకు తీవ్రగాయాలై రక్తస్రావం జరుగుతున్నా.. పక్కనే ఉన్న జనాలు ఎవరూ పట్టించుకోలేదు. చావుబ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న బైకర్ వద్దకు ఒక్కరూ కూడా రావడానికి కానీ, సహాయం కోసం 108కు ఫోన్ చేయడానికి కానీ ముందుకు రాలేదు.
నిండు ప్రాణం పోతుంటే వేడుక చూస్తున్నారే తప్ప సహాయం చేద్దామన్న మనసు ఒక్కరికి కూడా రాలేదు. దీంతో సదరు బైకర్ గిలగిల కొట్టుకుంటూ ప్రాణాలు వదిలాడు. ఈ ఘటన అంతా సీసీ ఫుటేజీలో రికార్డు అయింది. ఆ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. చూసినవారంతా అక్కడ ఉన్న వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతున్ని ఆసుపత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram