Viral Video | కుక్క‌ దెబ్బకు.. తోకముడిచిన చిరుత పులి..

Viral Video | చిరుత పులులు అంటేనే మిగ‌తా జంతువులన్నింటికి వ‌ణుకు. కానీ కొన్ని సంద‌ర్భాల్లో చిరుత కూడా పిల్లిలా భ‌య‌ప‌డిపోతోంది. అలాంటి ఘ‌ట‌నే మ‌హారాష్ట్ర‌లోని అహ్మ‌ద్‌న‌గ‌ర్‌లో వెలుగు చూసింది. అహ్మ‌ద్‌న‌గ‌ర్‌లోని ఓ ఇంటి వ‌ద్ద రాత్రి స‌మ‌యంలో పెంపుడు కుక్క నిద్రిస్తోంది. చీక‌టిగా ఉండ‌టంతో ఓ చిరుత పులి కూడా న‌క్కి నక్కి ఆ ఇంటి వైపు వ‌చ్చింది. ఇంటి ముందు ప‌డుకున్న కుక్క‌ను చూసి చిరుత దాడి చేయ‌బోయింది. కుక్క ఏ మాత్రం వెన‌క్కి […]

Viral Video | కుక్క‌ దెబ్బకు.. తోకముడిచిన చిరుత పులి..

Viral Video | చిరుత పులులు అంటేనే మిగ‌తా జంతువులన్నింటికి వ‌ణుకు. కానీ కొన్ని సంద‌ర్భాల్లో చిరుత కూడా పిల్లిలా భ‌య‌ప‌డిపోతోంది. అలాంటి ఘ‌ట‌నే మ‌హారాష్ట్ర‌లోని అహ్మ‌ద్‌న‌గ‌ర్‌లో వెలుగు చూసింది.

అహ్మ‌ద్‌న‌గ‌ర్‌లోని ఓ ఇంటి వ‌ద్ద రాత్రి స‌మ‌యంలో పెంపుడు కుక్క నిద్రిస్తోంది. చీక‌టిగా ఉండ‌టంతో ఓ చిరుత పులి కూడా న‌క్కి నక్కి ఆ ఇంటి వైపు వ‌చ్చింది. ఇంటి ముందు ప‌డుకున్న కుక్క‌ను చూసి చిరుత దాడి చేయ‌బోయింది.

కుక్క ఏ మాత్రం వెన‌క్కి త‌గ్గ‌కుండా.. గ‌ట్టిగా మొరిగింది. కుక్క దెబ్బ‌కు చిరుత తోక ముడిచింది. అటు నుంచి చెట్ల పొద‌ల్లోకి చిరుత పారిపోయింది. ఈ దృశ్యాలు అక్క‌డున్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.