Donald Trump : న్యూ ఇయర్ లో ట్రంప్ టార్గెట్ అదేనట!
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కొత్త ఏడాదిలో ప్రపంచ శాంతినే తన ప్రధాన లక్ష్యంగా ప్రకటించారు. “భూమిపై శాంతి” అనే సంకల్పంతో న్యూ ఇయర్ వేడుకల్లో పాల్గొన్నారు.
విధాత : న్యూ ఇయర్ 2026 సందర్బంగా ప్రజలు చాల వరకు కొత్త లక్ష్యాలు, నియమాలు విధించుకోవడం సాధారణం. అయితే ప్రపంచ పెద్దన్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కూడా న్యూ ఇయర్ వేళ ఓ లక్ష్యాన్ని నిర్ధేశించుకున్నట్లుగా ప్రకటించారు. గడిచిన ఏడాది మాదిరిగా సుంకాల పెంపు..వీసాల విధ్వంసాలు..షట్ డౌన్ తో ఉద్యోగాలకు గండి కొట్టడం వంటి లక్ష్యాలు కాకుండా ప్రపంచానికి ఊరటనిచ్చే విధంగా ట్రంప్ తన కొత్త ఏడాదిలో లక్ష్యాన్ని ప్రకటించాడు. ఇంతకు ట్రంప్ న్యూ ఇయర్ టార్గెట్ ఏమిటంటే…అందరూ ఆకాంక్షించే ప్రపంచ శాంతి.
అమెరికాలోని మార్-ఎ-లాగో రిసార్ట్‌లో విలాసవంతంగా నిర్వహించిన నూతన సంవత్సర వేడుకలకు సతీమణి మెలానియాలో కలిసి అధ్యక్షుడు ట్రంప్ హాజరయ్యారు. ఈ సందర్బంగా మీడియా ప్రతినిధి ట్రంప్ ను..మీ 2026 నూతన సంవత్సర సంకల్పం ఏమిటని ప్రశ్నించారు. దీనికి ట్రంప్ “శాంతి. భూమిపై శాంతి. భూమిపై శాంతి.” అని బదులిచ్చారు. “భూమిపై శాంతి” తన నూతన సంవత్సర సంకల్పమని అని న్యూ ఇయర్ రిజల్యూషన్‌ను వెల్లడించాడు. వెనిజులాపై దాడిలో సీఐఏ పాత్ర గురించి,ఉక్రెయిన్ యుద్దంపై అడిగిన ప్రశ్నలకు ట్రంప్ స్పందించలేదు.
ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా తన రెండవ పదవీకాలం ప్రారంభంలో శాంతిని పునరుద్ధరించడానికి కట్టుబడి ఉన్నానని, అనేక ప్రపంచ యుద్దాలకు ముగింపు పలికేందుకు చర్చలు జరుపుతానని తెలిపాడు. ఇప్పటికే ఎనిమిది యుద్ధాలను తాను స్వయంగా ముగించానని చెప్పుకున్నాడు. నోబెల్ శాంతి బహుమతిని పొందాలన్నది తన కోరిక అని నిరంతరం తపిస్తున్నారు. ఈ నేపధ్యంలో ప్రపంచ శాంతి తన న్యూ ఇయర్ లక్ష్యం అని ట్రంప్ మరోసారి తన మనసులోని మాటను వెల్లడించారు.
అమెరికా పురోగతి వేగవంతం
కాగా నూతన సంవత్సరం వేడుకలకు హాజరైన ట్రంప్ అమెరికా “నిజంగా బాగా పనిచేస్తోందని” అన్నారు, అమెరికాలోకి భారీగా పెట్టుబడులు వస్తున్నాయని, దేశ వ్యాప్తంగా కొత్త పరిశ్రమలు నిర్మించబడుతున్నాయని, అంచనాలను మించి పారిశ్రామిక పురోగతి సాగుతుందంటూ వృద్ధి గణాంకాలను ఉదహరించారు. సుంకాల ఆదాయంపై గొప్పగా చెప్పిన ట్రంప్ తద్వారా “వందల మిలియన్ల డాలర్లు” ఆర్జించిందని, ఆర్థికంగా, సైనికంగా దేశం పటిష్టంగా ఉందని, జాతీయ అభివృద్ది వేగంగా ముందుకెలుతుందని చెప్పకొచ్చారు.
ఇవి కూడా చదవండి :
First Sunrise Of 2026 : కొత్త ఏడాదిలో తొలి సూర్యోదయం..చూసేయండి!
New Year Food Orders : న్యూ ఇయర్ ఆర్డర్ లో మేటి.. బిర్యానీకి లేదు సాటి!
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram