ED Enters iBomma Piracy Case : ఐబొమ్మ కేసు.. రంగంలోకి ఈడీ
ఐబొమ్మ కేసులో మనీలాండరింగ్ ఉన్నట్లు ఈడీ అనుమానాలు వ్యక్తం చేయగా, ఇమ్మడి రవి ఖాతాల నుంచి రూ.3.5 కోట్లు ఫ్రీజ్ చేశారు. బెట్టింగ్ యాప్స్, క్రిప్టో లావాదేవీలపై దర్యాప్తు కొనసాగుతోంది.
హైదరాబాద్, విధాత : ఐ బొమ్మ వెబ్‌సైట్ కేసును దర్యాప్తు చేసేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగిది. ఈ మేరకు కేసుకు సంబంధించి వివరాలు ఇవ్వాలని హైదరాబాద్ సీపీ సజ్జనార్‌కు ఈడీ అధికారులు లేఖ రాశారు. ఐబొమ్మ వ్యవహారంలో మనీలాండరింగ్ జరిగినట్లు ఈడీ అనుమానాలు వ్యక్తం చేస్తోంది. నిందితుడు ఇమ్మడి రవి ఖాతాల నుంచి అధికారులు రూ.3.5 కోట్లు ఫ్రీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నెల 14న అరెస్టయిన రవి.. ప్రస్తుతం చంచల్‌గూడ జైల్లో ఉంటున్నారు. కాగా, బెట్టింగ్ యాప్స్ నుంచి ప్రకటనల రూపంలో నిందితుడు రవికి నిధులు అందినట్లు దర్యాప్తులో తేలింది. క్రిప్టో వాలెట్ నుంచి రవి ఎన్నారై అకౌంట్ నెలకు రూ.15 లక్షలు బదిలీ అయ్యాయి. దీంతో రి బ్యాంకు ఖాతాల నిర్వహణపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయనున్నారు.
కాగా, తెలుగు ఫిలిం ఛాంబర్ కంప్లైంట్ తో ఐ బొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. రవి పలు దేశాల్లో డొమైన్లు ఏర్పాటు చేసుకుని ఐ బొమ్మ వెబ్ సైట్ ను నిర్వహిస్తున్నాడు. ఒకసైట్ ను బ్లాక్ చేస్తే మరోటి సృష్టించాడు. ఇలా మిర్రర్ సైట్లను సృష్టించి పైరసీ సినిమాలు అప్లోడ్ చేశాడు. ఇలా 1972 నుంచి ప్రస్తుతం వరకు సుమారు 21వేల సినిమాలు నిందితుడి వద్ద ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో పాటు 50 లక్షల యూజర్ల డాటా కూడా రవి వద్ద ఉన్నట్లు తెలింది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram