Missing in godavari: గోదావరిలో 8 మంది యువకుల గల్లంతు

– గజ ఈతగాళ్లతో కొనసాగుతున్న గాలింపు
– శోకసంద్రంలో మునిగిపోయిన బాధిత కుటుంబాలు
Missing in godavari: సరదాగా స్నానం చేసేందుకు వెళ్లిన 8 మంది యువకులు గోదావరిలో గల్లంతయ్యారు. దీంతో వారి కోసం పోలీసులు గజ ఈతగాళ్లతో గాలిస్తున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం కమిని దగ్గర ఈ ఘటన చోటు చేసుకున్నది. వీరంతా ఓ వివాహ వేడుకకు హాజరయ్యేందుకు వచ్చినట్టు తెలుస్తున్నది.
కాకినాడ, రామచంద్రపురం, మండపేట గ్రామాలకు 11 మంది స్నేహితులు కే గంగవరం మండలం శేరుల్లంక గ్రామంలోని ఓ శుభకార్యానికి హాజరయ్యేందుకు వచ్చారు. వీరంతా వివాహ వేడుకకు హాజరైన అనంతరం స్నానం చేసేందుకు.. సరదాగా గోదావరిలో దిగారు.
మొత్తం 11 మంది యువకులు గోదావరిలో స్నానానికి దిగగా.. వీరిలో ఎనిమిది మంది గల్లంతు అయ్యారు. గల్లంతైన వారిని క్రాంతి (20), పాల్ (18), సాయి (18) సతీష్ (19) మహేష్, రాజేష్ (13), రోహిత్, మహేశ్ గా గుర్తించారు. ప్రస్తుతం గల్లంతైన వారికోసం పోలీసులు గజఈతగాళ్ల సాయంతో గాలింపు చేపట్టారు. బాధిత కుటుంబాలు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.