Viral | ఫోన్ తీసుకుందని.. లెక్చరర్‌ను ప‌బ్లిక్‌లో చెప్పుతో కొట్టిన విద్యార్థిని! (Video)

  • By: sr    news    Apr 22, 2025 2:01 PM IST
Viral | ఫోన్ తీసుకుందని.. లెక్చరర్‌ను ప‌బ్లిక్‌లో చెప్పుతో కొట్టిన విద్యార్థిని! (Video)

Viral | Video

విధాత: సెల్ ఫోన్‌కు అడిక్ట్ అవుతున్న విద్యార్థులు, చిన్నారులు వాటిని అతిగా వాడోద్ధంటూ పెద్దలు చెప్పిన.. మందలించిన సందర్భాల్లో చాల సీరియస్ గా స్పందిస్తున్న ఘటనలు పెరిగి పోతున్నాయి. ఫోన్ వాడనివ్వడం లేదంటూ బాల బాలికలు తల్లి, తండ్రులపై దాడి చేసిన ఘటనలు గతంలో సంచలనంగా మారాయి.

తాజాగా ఓ విద్యార్ధిని కళాశాలలో లెక్చరర్ తన సెల్ ఫోన్ తీసుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ గురువు అన్న గౌరవం లేకుండా చెప్పుతో దాడి చేసి కొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. విశాఖ పట్టణం రఘు కళాశాలలో చదువుతున్న విద్యార్థిని పదేపదే సెల్ ఫోన్ చూస్తుండటంతో గమనించిన మహిళా లెక్చరర్ సెల్ ఫోన్ లాగేసుకుంది.

దీంతో ఆగ్రహించిన ఆ విద్యార్థిని నా సెల్ ఫోన్ ఇస్తావా ఇవ్వవా అంటూ లెక్చరర్ తో వాగ్వివాదానికి దిగింది. లెక్చరర్ అందుకు నిరాకరించడంతో విద్యార్ధిని ఆవేశంతో ఆమె పైకి దూసుకెళ్లింది. నా ఫోన్ తీసుకోవడానికి నీవు ఎవరివంటూ.. ఆ ఫోన్ 12 వేలు అంటూ అసభ్యంగా దూషిస్తూ చెప్పుతో తన లెక్చరర్ పై దాడి చేసింది. గమనించిన తోటి విద్యార్థులు, లెక్చరర్లు వారిని విడిపించారు.

ఈ సంఘటన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాలం ఎంత మారిందనడానికి ఈ సంఘటనే ఓ నిదర్శనమని కొందరు…విద్యను వ్యాపారంగా మార్చేసి డబ్బులు తీసుకుని చదువు చెబితే గురువులకు గౌరవం ఇలాగా ఉంటుందని ఇంకొందరు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.