Gold Rate | అక్షయ తృతీయ రోజు పుత్తడి ప్రియులకు ఊరట.. తగ్గిన బంగారం ధరలు..!
Gold Rate | అక్షయ తృతీయ రోజు వినియోగదారులకు బంగారం ధరలు ఊరట కలిగించాయి. శుక్రవారం స్వల్పంగా పెరిగిన ధరలు.. శనివారం రోజున తగ్గుముఖం పట్టాయి. 24 క్యారెట్ల బంగారం ధర మళ్లీ రూ.61వేల దిగకు పడిపోయింది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.56వేల దిగువకు చేరుకున్నది. వెండి సైతం రూ.81వేలకు దిగువనే ట్రేడవుతున్నది. శనివారం హైదరాబాద్‌లో బంగారం(Gold)ధరలు భారీగానే తగ్గాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారంపై రూ.300 వరకు తగ్గి రూ.55,750కు చేరింది. ఇక […]
Gold Rate | అక్షయ తృతీయ రోజు వినియోగదారులకు బంగారం ధరలు ఊరట కలిగించాయి. శుక్రవారం స్వల్పంగా పెరిగిన ధరలు.. శనివారం రోజున తగ్గుముఖం పట్టాయి. 24 క్యారెట్ల బంగారం ధర మళ్లీ రూ.61వేల దిగకు పడిపోయింది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.56వేల దిగువకు చేరుకున్నది.
వెండి సైతం రూ.81వేలకు దిగువనే ట్రేడవుతున్నది. శనివారం హైదరాబాద్‌లో బంగారం(Gold)ధరలు భారీగానే తగ్గాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారంపై రూ.300 వరకు తగ్గి రూ.55,750కు చేరింది. ఇక 24 క్యారెట్ల బంగారం ధర రూ.330 వరకు తగ్గి, రూ.60,820 ధరకు చేరుకుంది.
మరోవైపు వెండిపై ఏకంగా రూ.900 వరకు తగ్గింది. ప్రస్తుతం కిలోకు రూ.80,400 ధరకు పలుకుతున్నది. ఇటీవల బంగారం(Gold)ధరలు స్వల్పంగా పెరుగుతూ తగ్గుతూ వస్తున్నాయి. అక్షయ తృతీయ నేపథ్యంలో భారీగా పెరిగే అవకాశం ఉంటుందని అంచనా వేసినా ధరలు మాత్రం స్వల్పంగా తగ్గడంతో వినియోగదారులు ఊపిరిపీల్చుకున్నారు.
అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు పడిపోతుండడంతో దేశీయంగా సైతం ధరలు దిగి వస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్ బంగారం(Gold) ధర 2వేల డాలర్ల దిగువలోనే ఉంది. ప్రస్తుతం ఔన్స్ బంగారం ధర 1984.90, ఇక వెండి ప్రస్తుతం 25.17 డాలర్ల దగ్గర ట్రేడవుతున్నాయి.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram