Gold Silver Price Today | భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో బంగారం, వెండి ధరల పతనం కొనసాగుతుంది. సోమవారం బంగారం, వెండి ధరలు భారీ తగ్గుదలను నమోదు చేశాయి. 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 5,950 తగ్గి రూ. 1,40,020వద్ద కొనసాగుతుంది. కిలో వెండి ధర రూ. 20,000తగ్గి రూ. 2,30,000వద్ద కొనసాగుతుంది.

Gold Silver Price Today | భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

విధాత, హైదరాబాద్ : అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో బంగారం, వెండి ధరల పతనం కొనసాగుతుంది. సోమవారం బంగారం, వెండి ధరలు భారీ తగ్గుదలను నమోదు చేశాయి. 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 5,950 తగ్గి రూ. 1,40,020వద్ద కొనసాగుతుంది. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 5,450తగ్గి రూ. 1,28,350వద్ద నిలిచింది. అటు వెండి ధరలు సైతం మరోసారి భారీగా తగ్గాయి. కిలో వెండి ధర రూ. 20,000తగ్గి రూ. 2,30,000వద్ద కొనసాగుతుంది.

మరింత తగ్గనున్న బంగారం, వెండి ధరలు

ఇరాన్ యుద్ద ప్రభావం బంగారం, వెండి ధరలపై పెద్దగా ప్రభావం చూపకపోవడంతోనే వాటి ధరలు దిగివస్తున్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఇంధన ధరలు పెరిగిపోతున్నప్పటికి, బంగారం, వెండి ధరలు పడిపోవడమే ఇందుకు నిదర్శనంగా పేర్కొంటున్నారు. మరికొన్ని రోజుల పాటు బంగారం, వెండి ధరలు మరింత తగ్గనున్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

మరోవైపు పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపధ్యంలో చైనా మాత్రం సైలెంట్ గా బంగారం, వెండి నిల్వలను పెంచుకుంటూ పోతుంది. పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా (PBOC) వరుసగా బంగారు నిల్వలను పెంచుకుంటూ పోవడం గమనార్హం. అమెరికా డాలర్ ఆధిపత్యానికి వ్యతిరేకంగా బంగారం, వెండి నిల్వలను పెంచుకోవడాన్ని చైనా ఓ సురక్షిత ‘బీమా పాలసీ’ గా భావిస్తుందని విశ్లేషిస్తున్నారు. 2026 మార్చి నాటి గణాంకాల మేరకు చైనా అధికారిక బంగారు నిల్వలు 2,309 టన్నులకు చేరుకున్నాయి. వీటి విలువ సుమారు 387.6 బిలియన్ డాలర్లు. గత 20 నెలల్లోనే చైనా విదేశీ మారక నిల్వల్లో బంగారం వాటా రెట్టింపు కావడం ఆ దేశం యొక్క సుదీర్ఘ లక్ష్యాలను స్పష్టం చేస్తోంది. వాస్తవానికి చైనా బంగారం, వెండి నిల్వలు అంతకంటే ఎక్కువే ఉండవచ్చని ప్రపంచ ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.