USFDA: మూర్ఛ వ్యాధిగ్రస్తులకు గుడ్ న్యూస్.. ఆ మందుల తయారీకి గ్రీన్ సిగ్నల్

  • By: sr    news    Apr 18, 2025 6:43 PM IST
USFDA: మూర్ఛ వ్యాధిగ్రస్తులకు గుడ్ న్యూస్.. ఆ మందుల తయారీకి గ్రీన్ సిగ్నల్

ముంబై: అలెంబిక్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ (అలెంబిక్) కార్బమాజెపైన్ టాబ్లెట్స్ యూఎస్‌పీ, 200 మి.గ్రా.ల తయారీ కోసం యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (యూఎస్‌ఎఫ్‌డీఏ) నుంచి ఆమోదం పొందినట్లు ప్రకటించింది. కార్బమాజెపైన్ టాబ్లెట్స్ యూఎస్‌పీ, 200 మి.గ్రా. మూర్ఛవ్యాధి నిరోధక ఔషధంగా ఉపయోగిస్తారు.

అలాగే, ట్రైజెమినల్ న్యూరాల్జియాతో సంబంధిత నొప్పి చికిత్సలో కూడా వీటిని వాడతారు. కార్బమాజెపైన్ టాబ్లెట్స్ యూఎస్‌పీ, 200 మి.గ్రా. మార్కెట్ విలువ డిసెంబర్ 2024తో ముగిసేసరికి సుమారు 32 మిలియన్ డాలర్లు ఉంటుందని ఐక్యూవీఐఏ అంచనా వేసింది. అలెంబిక్ ఇప్పటివరకు యూఎస్‌ఎఫ్‌డీఏ నుండి మొత్తం 222 రకాల మందుల తయారీకి ఆమోదం తెలిపింది.