Warangal | సభను విఫలం చేసేందుకు ప్రభుత్వం యత్నం: దాస్యం, పెద్ది

Warangal |
విధాత వరంగల్ ప్రతినిధి: బీఆర్ఎస్ రజతోత్సవ సభను విఫలం చేయాలనీ చూసిన రేవంత్ ప్రభుత్వానికి చెంపపెట్టుగా విజయవంతం చేసిన తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని బీఆర్ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షులు దాస్యం వినయ్ భాస్కర్ ధన్యవాదాలు తెలియజేశారు. హనుమకొండ పార్టీ జిల్లా కార్యాలయంలో సోమవారం మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డిలతో మీడియాతో మాట్లాడారు. సభ కు వివిధ రకాల వాహనాలతో పాటు ప్రజలు సైకిల్లపై ఎడ్ల బండ్ల పై పాదయాత్రగా, ఆటోలలో వచ్చి విజయవంతం చేశారన్నారు.
వరంగల్ జిల్లాలో ఈ సభను పెట్టడం..స్థానిక రైతులు సభకు సహకకరించి 1200 ఎకరాల భూములలిచ్చారని వారికీ ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు. 25 సంవత్సరాల బీ ఆర్ఎస్ పార్టీ కే సీ ఆర్ నాయకత్వంలో 60 సంవత్సరాల తెలంగాణను సాధించిందని వివరించారు. ఇందులో 14 ఏండ్ల పాటు తెలంగాణ కోసం పోరాటం చేశారని, 10 ఏండ్ల పాలనలో తెలంగాణను అన్ని రంగాల్లో దేశాన్ని అగ్రభాగాన నిలపినట్లు చెప్పారు. 16 నెలలో ప్రజల తరపున ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నామని వివరించారు.
చారిత్రాత్మక సభలకు వేదిక వరంగల్
నిచారిత్రాత్మక సభలకు వేదికగా వరంగల్ నిలిచిందని మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. సభ ను విజయవంతం అయ్యింది… దీనికి దేవుని ఆశీస్సులు ఉన్నాయన్నారు. ఎన్నడూ కూడా డ్యూటీలు చేయని ఆర్టీవోలు నిన్న రోడ్ల పై డ్యూటీ లు చేసి చెకింగ్ లు చేశారన్నారు. స్కూల్ బస్సులకు ఫైన్ లు వేయటం… వరంగల్ స్కూల్ యజమానులు స్వచ్చందంగా బస్సులు ఇస్తే వారిని ఇబ్బందులపాలు చేశారని అన్నారు. ప్రజలను చెకింగ్ పేరుతో నడిపించారని విమర్శించారు.
బీ ఆర్ ఎస్ పార్టీ ఏనాడూ ఎవరు సభ పెట్టుకున్న ఇబ్బంది పెట్టలేదన్నారు. పోలీసులు పూర్తిగా వైఫల్యం చెందారని విమర్శించారు. 2వేల మంది పోలీసులను ఇస్తా అని చెప్పి మోసం చేశారు.. 500 మంది పోలీసులను కూడా ఇవ్వలేదన్నారు. ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం సభకు పర్మిషన్ ఇవ్వకుంటే కోర్టు ద్వారా పర్మిషన్ తెచ్చుకున్నామన్నారు. సభ నిర్వహణలో పోలీసులకు మేము బారికేడ్ లు పెట్టమని చెప్పిన దగ్గర కాకుండా వారు ఎక్కడెక్కడో పెట్టి మమ్ములను ఇబ్బందులకు గురి చేశారన్నారు.