Gujarat Lion Selfie Gone Wrong | సింహంతో చెలగాటం..తప్పిన ప్రాణహాని

సెల్ఫీ కోసం సింహం దగ్గరకు వెళ్లిన యువకుడి దుస్సాహసం తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న ఘటన గుజరాత్‌లో జరిగింది. వీడియో వైరల్ అవుతోంది.

Gujarat Lion Selfie Gone Wrong | సింహంతో చెలగాటం..తప్పిన ప్రాణహాని

Gujarat Lion Selfie Gone Wrong | విధాత : సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యే పిచ్చి జనాలను దుస్సాహాసాలకు పురిగొల్పుతుంది. కొందరు రైలు పట్టాలపై పడుకుని వీడియోలు చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చకుంటుంటే..మరికొందరు నదులు, పర్వతాలపై సాహసోపేత వీడియోలు చేస్తూ ప్రమాదాల పాలవుతున్నారు. తాజాగా గుజరాత్‌లోని భావ్‌నగర్‌ తలాజాలో.. బాంబోర్ గ్రామంలో ఓ యువకుడు సింహంపై వీడియో చేసే ప్రయత్నంలో తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. వేటాడిన జంతు మాంసాన్ని తింటున్న సింహం దగ్గరకు వెళ్లి దానిని ఫోటోలు.. వీడియో తీయడం ప్రారంభించాడు. యువకుడు తనకు దగ్గరగా రావడాన్ని చూసిన సింహం ఒక్కసారిగా గర్జిస్తూ అతనిపై దూసుకెళ్లింది. భయంతో అతను కొంత వెనక్కి పరుగెత్తుతునే ఫోన్ లో వీడియో షూటింగ్ మాత్రం కొనసాగించాడు.

ఆ సమయంలో సింహం ఆహారం తినే మూడ్ లో ఉందేమోగాని..యువకుడిని లక్ష్యంగా చేసుకోకుండా మళ్లీ తన ఆహారం వైపు వెళ్లింది. దీంతో ఆ యువకుడు సింహం బారిన పడకుండా తప్పించుకున్నట్లయ్యింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు నిజంగా సింహానికి అక్కడ ఆహారం సిద్దంగా లేకపోతే ఆ యువకుడే దానికి ఆహారంగా మారేవాడని కామెంట్స్ చేస్తున్నారు. ఇటువంటి దుస్సాహసాలు అవసరమా అంటూ హితవు చెప్పారు.