Snake: కోరలు లేని.. పాముని ఎప్పుడైనా చూశారా!

విధాత: పాము జాతుల్లో విషపూరిత..విష రహిత పాములుండటం తెలిసిందే. అయితే కోరలు లేని(విష గ్రంధులు) లేని పాము జాతులలో ఒక్కోదాని ప్రత్యేకతలు.. జీవన శైలీ ఒక్కో రకంగా ఉంటున్నాయి. అయితే ఎక్కువగా ఎడారి ప్రాంతాల్లో, పర్వత ప్రాంతాల్లో కనిపించే రాటిల్ స్నేక్స్ అత్యంత విషపూరితంగా ఉంటాయి. ఇందులోనూ కోరలు లేని పాములు ఉండటం అరుదు.
ఓ కోరలు లేని పాము జీవనశైలీ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. గోధుమ చారలతో త్రిభుజాకారం తలతో కూడిన వింత రాటిల్ స్నేక్ ఒకటి మనిషిని కాటు వేయడానికి బెదిరిస్తోంది. అయితే ఆ పాము నోటిలో కోరలు(దంతాలు) మాత్రం లేవు. దీంతో గుడ్డు తినే ఆ పాము..కోరలు లేకపోయినా కాటు వేస్తానంటూ బెదిరింపులతో బతికేస్తుందంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
snake without fangs #viralvideo pic.twitter.com/W7LYRWEJlk
— srk (@srk9484) June 3, 2025
ఈ తరహా కోరలు లేని త్రిభుజాకారంలోని తల, గోధుమరంగు మచ్చలతో కూడిన పాము ఎస్ ఆకారంలో కాకుండా చుట్ట మాదిరిగా తమ ప్రయాణం కొనసాగించడం మరో వింత. అంతేకాదండోయో ఏడారి ఇసుకలో ఇవి అదే రీతిలో వెనుకకు కూడా ప్రయాణిస్తాయంటున్నారు స్నేక్ పరిశోధకులు. మరి ఈ వింత పామును చూస్తే మీకేమనిపిస్తుందో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి మరి