Hyderabad Metro Rail | హైదరాబాద్ మెట్రోరైల్ చార్జీలు పెంపు !

  • By: TAAZ |    news |    Published on : May 15, 2025 5:48 PM IST
Hyderabad Metro Rail | హైదరాబాద్ మెట్రోరైల్ చార్జీలు పెంపు !

Hyderabad Metro Rail | అనేక తర్జనభర్జనలు.. వాయిదాల పర్వం అనంతరం ఎట్టకేలకు హైదరాబాద్ మెట్రో రైల్ చార్జీలు పెంపు నిర్ణయాన్ని అధికారికంగా మెట్రో సంస్థ ప్రకటించింది. టికెట్ కనిష్ఠ ధర రూ.10 నుంచి రూ.12కు పెంచారు. గరిష్ఠ ధర రూ.60 నుంచి రూ.75కు పెంచారు. శనివారం నుంచి పెంచిన కొత్త చార్జీలు అమలులోకి రానున్నాయి.

పెరిగిన ఛార్జీల మేరకు మొదటి రెండు స్టాప్‌లకు రూ.12, రెండు నుంచి 4 స్టాప్‌ల వరకు రూ.18, 4 నుంచి 6 స్టాప్‌ల వరకు రూ.30, 6 నుంచి 9 స్టాప్‌ల వరకు రూ.40, 9 నుంచి 12 స్టాప్‌ల వరకు రూ.50, 12 నుంచి 15 స్టాప్‌ల వరకు రూ.55 పెరిగాయి. 15 నుంచి 18 స్టాప్‌ల వరకు రూ.60, 18 నుంచి 21 స్టాప్‌ల వరకు రూ.66, 21 నుంచి 24 స్టాప్‌ల వరకు రూ.70, 24 స్టాప్‌లు.. ఆపైన రూ.75 రూపాలుగా పెంచారు.

ఆదాయం సరిగా లేదన్న సాకుతో గతంలోనే ఉచిత పార్కింగ్‌ సదుపాయాన్ని మెట్రో రైల్‌ అధికారులు ఎత్తేసిన సంగతి తెలిసిందే. తాజాగా చార్జీలు కూడా పెంచడంతో ప్రజలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఆదాయం లేదనే పేరుతో ప్రజలపై బాదుడేంటని నిలదీస్తున్నారు.