Rain in Hyderabad: హైదరాబాద్ లో భారీ వర్షం.. ఐటీ కారిడార్ లో ట్రాఫిక్ జామ్

Rain in Hyderabad:  హైదరాబాద్ లో భారీ వర్షం.. ఐటీ కారిడార్ లో ట్రాఫిక్ జామ్

Rain in Hyderabad:  నైరుతి రుతుప‌వ‌నాల ప్ర‌భావంతో హైద‌రాబాద్ లో భారీ వ‌ర్షం ప‌డుతోంది. దీంతో ఐటీ కారిడార్ లో ఎక్క‌డిక‌క్క‌డ వాహ‌నాలు నిలిచిపోయాయి.

సోమ‌వారం నుంచి గురువారం వ‌ర‌కు తెలంగాణ వ్యాప్తంగా భారీ వ‌ర్షాలు కురిసే అవకాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ‌శాఖ హెచ్చ‌రించిన విష‌యం తెలిసిందే. సోమ‌వారం కురిసిన వ‌ర్షంతో న‌గ‌ర ప్ర‌జ‌లు తీవ్రంగా ఇబ్బందులు ప‌డుతున్నారు. జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, ఫిలింనగర్‌, గచ్చిబౌలి, హైటెక్‌ సిటీ, మాదాపూర్, మణికొండ, మెహిదీపట్నం, టోలిచౌకీ, మాసబ్‌ట్యాంక్‌, నాంపల్లిలో వాన దంచికొడుతున్న‌ది.

రాష్ట్రంలోని పలు జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి. ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, ఖమ్మం, వికారాబాద్, నిర్మల్ జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.