Breakfast: బ్రేక్ ఫాస్ట్‌లో ఇవి తిన్నారో.. అంతే సంగతులు!

ఉరుకులు పరుగుల జీవితంలో ఉదయం ఇంట్లోనే బ్రేక్ ఫాస్ట్ సిద్ధం చేయడం కూడా కష్టంగా మారింది. అయితే ఆరోగ్యకరమని భావించి కొన్ని ఆహారాలను ఎంచుకుంటాం. కానీ వాటిలో కొన్ని ఆరోగ్యానికి హాని కలిగించవచ్చు. అల్పాహారంలో తీసుకోకూడని ఆహారాల గురించి తెలుసుకుందాం.
తృణధాన్యాలు
తృణధాన్యాలు ఆరోగ్యకరమని ప్రచారం ఉన్నప్పటికీ, వీటిలో శుద్ధి చేసిన చక్కెర, కార్బోహైడ్రేట్లు అధికంగా ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను పెంచి, ఆరోగ్య సమస్యలను కలిగిస్తాయి.
పెరుగు
పెరుగులో ప్రోటీన్, విటమిన్ బి12 ఉన్నప్పటికీ, ఉదయం తీసుకోవడం ఆయుర్వేదం ప్రకారం శ్లేష్మం (మ్యూకస్) ఉత్పత్తిని పెంచి, జీర్ణవ్యవస్థకు హాని కలిగిస్తుంది.
ప్రోటీన్ బార్లు
సమయాభావంతో ప్రోటీన్ బార్లను ఎంచుకుంటారు. కానీ వీటిలో చక్కెర, కృత్రిమ పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి ఆశించిన పోషకాలను అందించక, ఆరోగ్యానికి హాని చేస్తాయి.
పండ్ల రసం
తీపి పండ్ల రసం ఉదయం తాగడం చక్కెర స్థాయిలను హఠాత్తుగా పెంచుతుంది. ఫైబర్ లేని ఈ రసాలు పూర్తి పోషకాలను అందించవు. నిమ్మరసం లేదా దోసకాయ రసం మంచి ఎంపికలు.
వేఫెల్స్ మరియు ప్యాన్‌కేకులు
వీటిని శుద్ధి చేసిన పిండి, చక్కెర సిరప్, వెన్నతో తయారు చేస్తారు. ఇన్‌స్టంట్ రకాలు అధిక చక్కెర, కొవ్వును కలిగి ఉండి, ఆరోగ్యానికి హానికరం.