IRCTC Best Package: వైజాగ్, అరకు అందాలు అలా చుట్టివద్దామా
IRCTC రూ.10890కే వైజాగ్–అరకు అందాలు చూపే 5రోజుల టూర్ ప్యాకేజీ. బొర్రా కేవ్స్, కైలాసగిరి, రుషికొండ బీచ్‌తో అద్భుత యాత్ర.
వైజాగ్ అనగానే వెంటనే మనకు గుర్తుకు వచ్చేది సముద్ర తీరం, బీచులు. విశాశఖలో సముద్రాన్ని మించిన అందాలు మరెన్నో ఉన్నాయి. బొర్రకేవ్స్ అరకు అందాలు, ప్రకృతి రమణీయతతోపాటు ఆధ్యాత్మిక దర్శనాలను సైతం చూడవచ్చు. అసలే చలికాలం అరకు అందాలు అదరహో అనిపిస్తాయి. బొర్రా గుహలు, ఘాట్ రోడ్లతో దారంతా కన్నుల పండగగా ఉంటుంది. గిరిజన ప్రాంతమైన అరకు విశాఖ ప్రాంతంలో అతిపెడ్డ టూరిస్ట్ స్పాట్. ఇలాంటి అద్భుతమైన ప్రదేశాన్ని ఒక్కసారైనా చూడాలి. అందుకే IRCTC తక్కువ ధరకే రూ.10890కే విశాఖపట్నం, ప్రకృతి సౌందర్యమైన అరకు అందాలను చూపించేందుకు మన ముందుకు జ్యువెల్ ఆఫ్ ఈస్ట్ కోస్ట్ అనే పేరుతో మంచి ప్యాకేజీని తీసుకువచ్చింది. ఈ నెల 20న టూర్ ప్రారంభం కానుంది. ఈ ప్యాకేజీకి సంబంధించి ప్రతి గురువారం రైలు ఉంటుంది.
iBOMMA Ravi| ఐబొమ్మ నిర్వాహకుడు రవి అరెస్టు..విచారణ
యాత్ర పూర్తి వివరాలు: ఈ యాత్ర పూర్తిగా నాలుగు రాత్రులు, ఐదు రోజుల పాటు ఉంటుంది. మొదటి రోజు హైదరాబాద్ రైల్వే స్టేషన్‌లో సాయంత్రం 5.05 గంటలకు ట్రైన్ నెంబర్: 12728 గోదావరి ఎక్స్ ప్రెస్ బయలు దేరుతుంది. రాత్రంతా ప్రయాణం ఉంటుంది. మరుసటి రోజు ఉదయమే 5.55 గంటలకు విశాఖకు చేరుకుంటారు. అక్కడ హోటల్‌లో బస ఏర్పాటు చేస్తారు. బ్రేక్‌ఫాస్ట్ చేసుకున్న తర్వాత కాళీమాత దర్శనాన్ని చేసుకుంటారు. వెంటనే అక్కడి నుంచి సబ్‌మెరైన్ మ్యూజియం వెళ్తారు. అందులో భారత నావికాదళం గురించి భారత సబ్‌మెరైన్‌ల గురించి తెలుసుకోవచ్చు. అక్కడి నుంచి మధ్యాహ్నం హోటల్‌లో లంచ్ చేస్తారు. భోజనానంతరం విశాఖలో ఎంతో అందమైన ప్రకృతి రమణీయమైన కైలాస గిరి హిల్స్‌కు వెళ్తారు. ఆ తర్వాతర పక్కనే ఉన్న రుషికొండ బీచ్ అందాలు ఆస్వాదిస్తారు. రాత్రి వైజాగ్‌లోనే బస చేస్తారు. మూడవ రోజు ఉదయం హోటల్‌లో బ్రేక్ ఫాస్ట్ ముగించుకుని అరకు అందాలు కనువిందు చేసుకునేందుకు బయలదేరుతారు. టైడా జంగిల్ బెల్స్ చూశాక కాస్త విశ్రాంతి తీసుకుని, వెంటనే పద్మాపురం గార్డెన్స్, ట్రైబల్ మ్యూజియం దర్శించుకుంటారు. ఇక్కడ భోజనం మీ సొంత ఖర్చులతో చేసుకోవాల్సి ఉంటుంది. అనంతరం గాలికొండ వ్యూ పాయింట్, బోర్రా కేవ్స్ చూసి సాయంకాలం విశాఖకు తిరుగు ప్రయాణం అవుతారు. రాత్రికి విశాఖలోని హోటల్‌కు చేరుకుని భోజనం చేసి విశ్రాంతి తీసుకుంటారు. ఇక నాలుగో రోజు ఉదయం టిఫిన్ ముగించుకుని హోటల్ నుంచి చెక్ అవుట్ అవుతారు. అక్కడి నుంచి సింహాచలం అప్పన్న స్వామి దర్శనం చేసుకుంటారు. అక్కడి నుంచి మధ్యాహ్నం ఆర్కే బీచ్‌కు వెళతారు. బీచ్ చూశాక విశాఖపట్నం రైల్వే స్టేషన్‌కు సాయంత్రం 4 గంటలకు చేరుకుంటారు. ట్రైన్ నెంబర్ 12727 గోదావరి ఎక్స్‌ప్రెస్ సాయంత్రం 5.20 ఎక్కి చివరగా ఐదవ రోజు ఉదయం 6.15 గంటలకు హైదరాబాద్ చేరుకుంటారు.
Rana Daggubati : బెట్టింగ్ యాప్ కేసులో సిట్ విచారణకు నటుడు రానా
టికెట్ ధరలు: ఈ ప్యాకేజీలో కంఫర్ట్, స్టాండర్డ్ అని రెండు రకాలు ఉంటాయి. కంఫర్ట్ అయితే రైల్లో 3ఏసీ టికెట్, హోటల్‌లో ఏసీ గదులు ఉంటాయి, అదే స్టాండర్డ్ అయితే రైల్లో స్లీపర్ టికెట్, హోటల్‌లో నాన్ ఏసీ గదులు ఉంటాయి. ఇక ఈ యాత్రకు ఒక్కరు మాత్రమే వెళ్తే కంఫర్ట్ అయితే రూ. 27910, స్టాండర్డ్ అయితే రూ. 26010. ఇద్దరు కలిసి వెళ్తే ఒక్కొక్కరికి కంఫర్ట్ అయితే రూ. 17010, స్టాండర్డ్ రూ. 15110. ముగ్గురు కలిసి వెళ్తే మాత్రం ఒక్కొక్కరికి కంఫర్ట్ అయితే రూ. 13370, స్టాండర్డ్ అయితే రూ. 11480 చొప్పున పడుతుంది. ఒకవేళ మీరు నాలుగు నుంచి ఆరుగురు వెళ్తే మాత్రం ఇద్దరు లేదా ముగ్గురు చొప్పున టికెట్లు తీసుకోవచ్చు. ఆరుగురు కలిసి వెళ్లిన వారిలో ఇద్దరి చొప్పున గదులు తీసుకోవాలను కుంటే మాత్రం ఒక్కొక్కరికి కంఫర్ట్ అయితే రూ. 15130, స్టాండర్డ్ రూ. 13240 చొప్పున, అదే ముగ్గురు కలిసి ఉండాలనుకుంటే మాత్రం ఒక్కొక్కరికి కంఫర్ట్ రూ. 12790, స్టాండర్డ్ రూ. 10890 చొప్పున కట్టవాల్సి ఉంటుంది. అదే మీతోపాటు 5 నుంచి 11 ఏళ్ల పిల్లలు ఉంటే వారికి విత్ బెడ్‌తో అయితే కంఫర్ట్ లో రూ. 8900, వితౌట్ బెడ్ అయితే రూ. 6270. అదే స్టాండర్డ్ అయితే విత్ బెడ్ రూ. 7000, వితౌట్ బెడ్ అయితే రూ.4370 చొప్పున కట్టవాల్సి ఉంటుంది.
నోట్: మరింత సమాచారం కోసం IRCTC వెబ్‌సైట్‌ను సంప్రదించగలరు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram