యాక్టివాలోకి దూరిన నాగుపాము.. ఈ వీడియో చూడాలంటే ధైర్యం ఉండాల్సిందే..

King Cobra | విధాత: నాగుపాము.. ఈ పేరు వింటేనే శరీరంలో వణుకు పుడుతోంది. మరి ఆ పామును ప్రత్యక్షంగా చూస్తే శరీరమంతా చెమటలు పట్టాల్సిందే. ఒళ్లంతా గగుర్పాటుకు గురి కావాల్సిందే. అలాంటిది ఆరు అడుగుల పొడవున్న నాగుపామును సునాయాసంగా పట్టేశాడు ఓ యువకుడు. యువ‌కుడి దుప్ప‌ట్లో దూరి.. రాత్రంతా నిద్రించిన నాగుపాము.. తన చేతులకు ఎలాంటి గ్లౌసులు ధరించకుండా చాకచక్యంతో పామును బయటకు తీసుకువచ్చాడు. ఆ పాము పడగవిప్పి బుసలు కొడుతున్నప్పటికీ ఏ మాత్రం బెదరలేదు. […]

  • Publish Date - March 1, 2023 / 11:30 AM IST

King Cobra | విధాత: నాగుపాము.. ఈ పేరు వింటేనే శరీరంలో వణుకు పుడుతోంది. మరి ఆ పామును ప్రత్యక్షంగా చూస్తే శరీరమంతా చెమటలు పట్టాల్సిందే. ఒళ్లంతా గగుర్పాటుకు గురి కావాల్సిందే. అలాంటిది ఆరు అడుగుల పొడవున్న నాగుపామును సునాయాసంగా పట్టేశాడు ఓ యువకుడు.

యువ‌కుడి దుప్ప‌ట్లో దూరి.. రాత్రంతా నిద్రించిన నాగుపాము..

తన చేతులకు ఎలాంటి గ్లౌసులు ధరించకుండా చాకచక్యంతో పామును బయటకు తీసుకువచ్చాడు. ఆ పాము పడగవిప్పి బుసలు కొడుతున్నప్పటికీ ఏ మాత్రం బెదరలేదు. పైపెచ్చు ఆ యువకుడికి పాము ఎలాంటి హానీ కలిగించలేదు. అయితే ఒళ్లు గగుర్పొడిచే ఈ వీడియో చూడాలంటే మీకు గుండెల్లో దమ్ము, ధైర్యం ఉండాల్సిందే.

ఎక్కడి నుంచి ఎలా వచ్చిందో గానీ ఓ నాగుపాము ఓ యాక్టివాలో దూరింది. బండి ముందు భాగంలో బ్యాటరీ ఉంచే ప్లేస్‌లో నాగుపాము ఉందని బైక్ యజమాని గుర్తించి సమీపంలో ఉండే స్నేక్‌ క్యాచర్‌ అవినాష్ యాదవ్‌కు సమాచారం అందించాడు. వెంటనే అక్కడకు వచ్చిన ఆ యువకుడు.. యాక్టివా వద్దకు చేరుకుని స్క్రూ డ్రైవర్‌తో ముందు భాగాన్ని విప్పాడు.

మీరు క్రెడిట్ కార్డు వాడుతున్నారా..? అయితే, మీకు గుడ్ న్యూస్‌!

ఇంకేముంది నాగుపాము బుసలు కొడుతూ పడగ విప్పింది. అవినాష్ ఏ మాత్రం బెదరకుండా.. కొంత సమయం శ్రమించి, నాగుపామును తన చేతులతో పట్టి బయటకు తీశాడు. ఈ క్రమంలో ఆ పాము అతనికి ఎలాంటి హానీ కలిగించకుండా మసులుకోవడం మరో విశేషం.

ఇక అవినాష్ పామును పడుతున్న సమయంలో అక్కడున్న వారంతా తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈ దృశ్యాలను తమ ఫోన్లలో బంధించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది. ఇటీవలి కాలంలో నాగుపాములు బైకుల్లో దూరుతున్న ఘటనలు సాధారణమయ్యాయి.

షేక్‌ అవుతున్న ఇంటర్నెట్.. ఈ వీడియో చూసే దమ్ముందా..?

నాగుపాము ప‌డ‌గ‌కు ముద్దు పెట్టాడు.. ఆ తర్వాత? (Video)

Latest News